చెక్ బౌన్స్ కేసులో హైకోర్టులో ఊరట
పిటిషన్ కొట్టివేత
రాజీకి వచ్చిన ఇరువురూ
ఇరువురి సమ్మతితో పిటిషన్ కొట్టివేత
రూ.70 లక్షలు తీసుకున్న అనిత
తిరిగి ఇచ్చే క్రమంలో బౌన్స్ అయిన చెక్
2019 నుంచి కొనసాగుతున్న విచారణ
అమరావతి, స్వేచ్ఛ:
ఏపీ హోంశాఖ మంత్రి అనితకు బుధవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై నమోదయిన చెక్ బౌన్స్ కేసు కొట్టివేసింది. తన వద్ద రూ.70 లక్షలు మంత్రి అనిత అప్పుగా తీసుకున్నారని అయితే 2015లో తాను ఆమెకు అప్పుగా ఇచ్చినట్లు వేగి శ్రీనివాసరావు తెలిపారు. కాగా 2018లో తాను తీసుకున్న రూ.70 లక్షలకు గానూ అనిత చెక్కును తనకు ఇచ్చారని నిధులు లేక ఆ చెక్కు బౌన్స్ అయిందని ఆరోపించారు శ్రీనివాసరావు. ఇందుకు సంబంధించి 2019లో విశాఖపట్నం ఏడవ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శ్రీనివాసరావు. అప్పటినుంచి విచారణ జరుగుతుండగా రీసెంట్ గా ఈ చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి ఇద్దరూ రాజీ పడ్డారు.
రాజీకి వచ్చిన ఇరువురూ
ఈ కేసు ఏడో స్పెషల్ మేజిస్త్రేట్ కోర్టు పరిధిలో విచారణ జరిగింది. తాము ఇరువురం రాజీకి రావడంతో తనపై దాఖలు అయిన కేసును కొట్టేయాలని అనిత హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అనితపై చెక్ బౌన్స్ కేసును కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.