BigTV English

Manchu Manoj Became Father: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మంచు మనోజ్ భార్య..!

Manchu Manoj Became Father: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మంచు మనోజ్ భార్య..!

Manchu Manoj- Mounika Blessed with a Baby Girl: మంచు వారింట సంబరాలు మొదలయ్యాయి. మంచు మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.” అలా వారు నలుగురు అయ్యారు.. దేవతల ఆశీర్వాదంతో.. ఇప్పుడు వారి జీవితంలోకి ఒక చిన్న దేవత వచ్చింది. మనోజ్ మరియు మౌనిక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ ఆడబిడ్డను స్వాగతించారని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. ధైరవ్ తన పెద్ద అన్నగా ఆనందానికి అవధుల్లేవు. ఆమె ముద్దుపేరుతో మనమందరం ఆమెను ప్రేమగా ‘MM పులి’ అని పిలుస్తాము. ఈ సంపూర్ణ కుటుంబానికి శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి ప్రేమతో వారిని ఆశీర్వదించండి” అంటూ చెప్పుకొచ్చింది.


మంచు మనోజ్.. భూమా మౌనికను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే మౌనికకు పెళ్లి అయ్యి ధైరవ్ అనే కొడుకు ఉన్నాడు. ఆ తరువాత భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత మనోజ్ తో పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్ళింది. ధైరవ్ తనకు శివుడి ఇచ్చిన బహుమతి అని మనోజ్ అతనిని కూడా కొడుకుగా స్వీకరించాడు.

Also Read: Manchu Manoj: చిరంజీవి- మోహన్ బాబు మధ్య గొడవలు అలాంటివి.. రామ్ చరణ్ ఎలాంటివాడంటే..?


ఇక గతేడాది చివర్లో మనోజ్.. తాను తండ్రి కానున్నట్లు తెలిపాడు. ఇక ఇప్పుడు మంచు వారింటికి కొత్త వారసురాలు వచ్చింది. ఇప్పటికే అంచు విష్ణుకు ఇద్దరు ఆడపిల్లలు కాగా.. మంచు లక్ష్మీకి ఒక కూతురు ఉంది. ఇక మనోజ్ కూతురితో.. మంచు ఇంట నలుగురు దేవతలు ఉన్నట్లు అన్నమాట. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు మంచు మనోజ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×