BigTV English

Manchu Manoj: చిరంజీవి- మోహన్ బాబు మధ్య గొడవలు అలాంటివి.. రామ్ చరణ్ ఎలాంటివాడంటే..?

Manchu Manoj: చిరంజీవి- మోహన్ బాబు మధ్య గొడవలు అలాంటివి.. రామ్ చరణ్ ఎలాంటివాడంటే..?


Manchu Manoj: మంచు వారి కుటుంబంలో ట్రోల్స్ బారిన పడకుండా అభిమానుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో మంచు మనోజ్. సినిమాలు తక్కువ చేసినా కూడా అందరి మనస్సులో మనోజ్ మంచి వ్యకిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక భూమా మౌనికను వివాహమాడిన తరువాత కెరీర్ మీద ఫోకస్ పెట్టిన మనోజ్ ఒకపక్క షోస్ తో బిజీగా ఉంటూ ఇంకోపక్క మంచి కథలను ఎంచుకొనే పనిలో ఉన్నాడు. ఇక మంచు కుటుంబానికి, మెగాస్టార్ కుటుంబానికి ఎలాంటి స్నేహ సంబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, మోహన్ బాబు ల మధ్య ఎపప్టినుంచో విబేధాలు నడుస్తూనే ఉన్నాయి. అయినా వారి పిల్లలు మాత్రం ఎప్పుడు ఫ్రెండ్స్ లానే ఉంటారు. ముఖ్యంగా మనోజ్, చరణ్ మంచి స్నేహితులు. నిన్న  రామ్ చరణ్ పుట్టినరోజు  వేడుకల్లో మనోజ్ కూడా పాలుపంచుకున్నాడు. తన ప్రాణ స్నేహితుడు అయిన చరణ్ గొప్ప మనసు గురించి చెప్పుకొచ్చాడు.

” చరణ్ నా ప్రాణ స్నేహితుడు. చెన్నైలో మా ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. మేమెప్పుడు కలిసి ఆడుకొనేవాళ్ళం. చరణ్ కు దయాగుణం చిన్నతనం నుంచి ఉంది. పక్కనవాడు కష్టాల్లో ఉంటే అస్సలు తట్టుకోలేడు. తన మంచితనం వలనే నేను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను. ముఖ్యంగా చరణ్.. స్నేహానికి ఎంత విలువ ఇస్తాడంటే.. దుబాయ్ లో ఉండే ఒక తెలుగింటి ఆడపిల్లకు కష్టమొచ్చింది. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. నా దగ్గర అంత డబ్బు లేదు. అర్ధరాత్రి.. చరణ్ కు ఫోన్ చేసి.. దుబాయ్ లో తెలుగు ఆడపిల్ల చిక్కుకుపోయిందిరా.. నేను చేయాల్సినంతా చేశాను.. ఒక రూ.5 లక్షలు తక్కువ అయ్యాయిరా అని అడిగాను. వెంటనే అకౌంట్ నంబర్ పంపమని చెప్పి క్షణాల్లో డబ్బు పంపాడు. తడి గొప్పవాడు చరణ్.


ఇక చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. మీ తండ్రులు ఏమో ఎప్పుడు గొడవపడుతూ ఉంటారు. మీరు చూస్తే ఫ్రెండ్స్ లా ఉంటారు. అసలేంటి.. ? అని. చిరంజీవి- మోహన్ బాబు మధ్య గొడవలు ఎప్పుడు ఉంటాయి. భార్యాభర్తలు కొట్టుకున్నట్లు కొట్టుకుంటారు. మళ్లీ కలిసిపోతారు. టామ్ అండ్ జెర్రీలా అన్నమాట. ఎవరి గొడవల్లో అయినా దూరొచ్చు కానీ, వీరిద్దరి గొడవల్లో అస్సలు దూరాకూడదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మనోజ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×