Big Stories

Anantapur TDP Ticket Issue: డౌట్స్ అనంతం.. అభ్యర్థి ప్రసాదా? ప్రభాకర్ చౌదరా?

- Advertisement -

అనంతపురం జిల్లా అంటే గత ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించేవారు. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ 2014 ఎన్నికల్లో 12 సీట్లు దక్కించుకుంది. అయితే 2019 ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయింది. వైసీపీ 12 సీట్లు గెలుచుకుంటే.. టీడీపీ 2 స్థానాలకే పరిమితమైంది.అయిదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కున్నా జిల్లాలో పసుపు సైనం చెక్కుచెదరలేదంటారు. కేడర్ పరంగా ఎంత బలంగా ఉన్నా ఈ సారి టికెట్ల కేటాయింపులో తలెత్తిన విభేదాలు ఇంతవరకు సర్దుకోకపోవడంతో కార్యకర్తల్లో , నేతల్లో టెన్షన్ కనిపిస్తుంది. బుజ్జగింపులు లేట్ అవుతున్న కొద్దీ.. కొత్త కొత్త ఈక్వేషన్లు, సరికొత్త స్ట్రాటజీలు తెరపైకి వస్తున్నాయి. ముందు నుంచి అనంతపురం అర్బన్ సీటులో టీడిపి టికెట్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికే అనుకున్నారు.

- Advertisement -

Also Read: కావ్య ‘కుల’కలం.. కడియం కావ్యపై ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ శ్రేణులన్నీ అదే నమ్మకంతో ఉన్న టైంలో సరికొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చి అందరికీ షాక్ ఇచ్చారు టీడీపీ అధినే.. అర్బన్ టికెట్ దగ్గుపాటి ప్రసాద్ అనే మాజీ ఎంపీపీకి కేటాయించడంతో ప్రభాకర్ చౌదరి షాక్ తినాల్సి వచ్చింది. దాంతో ఆయన అనుచరులు రెండు రోజుల పాటు భారీ హంగామా సృష్టించారు . పార్టీ కార్యాలయం ధ్వంసం చేసి సీట్ అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద పార్టీ జెండాలను, ఎన్నికల సామగ్రిని కాల్చి పడేశారు.. ప్రభాకర్ చౌదరి కూడా అంతేస్థాయిలో టీడిపి అధినేతపై రియాక్ట్ అయ్యారు.

పార్టీ కోసం 5 ఏళ్ళు కష్టపడితే ఇప్పుడు వేరే వ్యక్తికీ టికెట్ ఏలా కేటాయిస్తారని తీవ్ర స్థాయిల్లో విరుచుకుపడ్డారు. తన భవిష్యత్ కార్యాచరణ మరో రెండు రోజుల్లో ప్రకటిస్తానని అల్టిమేటం ఇచ్చారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని సంచలన ప్రకటన చేశారు. ఇక చంద్రబాబు నాయుడు పిలిచినా కలిసేది లేదని తనను సంప్రదించకుండానే అభ్యర్ధిని ప్రకటించి తర్వాత కూడా తనను కాంటాక్ట్ చేయలేదని .. ఇక తాను చంద్రబాబుని కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అభ్యర్ధిని ప్రకటించాక రెండు మూడు రోజులు ఆ హడావుడి చేసిన ఆయన తర్వాత సైలెంట్ అయ్యారు.

ప్రభాకరచౌదరి సైలెంట్ గా ఉండడంతో  అదే అదునుగా భావించిన దగ్గుపాటి ప్రసాద్ తన మార్క్ రాజకీయం చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వరుస పెట్టి ప్రభాకర్ చౌదరి వర్గం నాయకులను కలుస్తూ అందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కొంతవరకు సక్సస్ కూడా అయ్యారు. చివరకు వైకుంఠం ప్రభాకర్ చౌదరి తమ్ముడు వైకుంఠం జయచంద్ర చౌదరి కూడ దగ్గుపాటి ప్రసాద్‌‌కే తన సపోర్ట్ అని రాజకీయాల్లో దగ్గుపాటి వెంటే ఉంటానని ప్రకటించారు.

Also Read: స్వ(వి)పక్షం.. వైసీపీలో రగులుతున్న మంటలు

మరోవైపు ప్రభాకర్ చౌదరి వ్యతిరేఖ వర్గం నాయకులను కూడా కలసి వారి మద్దతు కూడగట్టుకుంటున్న దగ్గుబాటి ప్రసాద్ ప్రచారంలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. తమ వర్గం నాయకులన్ని, పార్టీలో తన వ్యతిరేకుల్ని కలుపుకొని దగ్గుపాటి ప్రసాద్ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రభాకర్‌చౌదరి సడన్‌గా వెళ్లి చంద్రబాబుని కలిసివచ్చారు .. అనంతపురం చేరుకోగానే రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి నివాళి అర్పించి స్పీడ్ పెంచారు.

టీడీపీ అధిష్టానం తిరిగి ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తుందని తన అభ్యర్థితత్వాన్ని కావాలి అనుకుంటే 2 నొక్కాలి అంటూ వాట్సాప్‌లో ప్రచారం వైరల్ చేస్తున్నారు. మరోసారి అనంత అర్బన్ అభ్యర్థి కోసం రీ సర్వే జరుగుతుందని కార్యకర్తల్లో చర్చ జరిగేలా చేశాడు. దాంతో నిజంగానే అభ్యర్ధిని మారుస్తారన్న ప్రచారం మొదలైంది. రీసర్వేపై ప్రభాకర చౌదరి వర్గం ప్రచారాన్ని తిప్పికొట్టే పనిలో పడింది దగ్గుపాటి ప్రసాద్ వర్గం. సర్వే ప్రచారాన్ని నమ్మొద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

చంద్రబాబుని కలసే ప్రసక్తే లేదన్న ప్రభాకరచౌదరి తీరా వెళ్లి ఆయన్ని కలిసి వచ్చాక మొదలైన సర్వే హడావుడితో అసలేం జరుగుతుందో అర్ధంకాకా టీడీపీ కేడర్‌లో తీవ్ర కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. మరి అనంత అర్బన్ కేండెట్‌పై టీడీపీ అధినేత ఎప్పుడు క్లారిటీ ఇస్తారో?  నిజంగానే అభ్యర్ధిని మారుస్తారా? లేకపోతే బీఫాం ఇచ్చేదాకా ఎదురుచూడాల్సిందేనా? అని తెలుగుతమ్ముళ్లు నిట్టూరుస్తున్నారు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News