E-Paper
Advertisement

Manchu Mohan Babu: ప‌గ‌వాడికి కూడా నా క‌ష్టాలు రాకూడ‌దు: మోహ‌న్ బాబు

Manchu Mohan Babu: ప‌గ‌వాడికి కూడా నా క‌ష్టాలు రాకూడ‌దు: మోహ‌న్ బాబు

Manchu Mohan Babu: తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో హీరోగా, విల‌న్‌గా, విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న 600కి పైచిలుకు చిత్రాల్లో న‌టించిన వ్య‌క్తి క‌లెక్ష‌న్ కింగ్ డా.మంచు మోహ‌న్ బాబు. రాజ‌కీయాల్లోనూ రాణించారు. శ్రీవిద్యానికేత‌న్ సంస్థ‌ను స్థాపించి స‌క్సెస్ అయ్యారు. మార్చి 19న ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆసక్తిక‌ర‌మై విష‌యాల‌ను తెలియ‌జేశారు. సినిమా రంగంలో ఒకానొక ద‌శ‌లో అంటే అల్లుడుగారు సినిమాకు ముందు.. మోహ‌న్ బాబు కెరీర్ చాలా డౌన్ అయ్యింది. ఏకంగా ఆయ‌న త‌న ఇంటిని అమ్ముకున్నారు. సినీ ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ త‌న‌కు అప్పుడు సాయం చేయ‌లేద‌ని, త‌న‌లాంటి క‌ష్టాలు ప‌గ‌వాడికి కూడా రాకూడ‌ద‌ని ఆయ‌న తెలిపారు.

ఇక రాజ‌కీయాల గురించి చాలా ప‌రుషంగానే మాట్లాడిన‌ట్టు ప్రోమో చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. అలాగే స‌న్నాఫ్ ఇండియా, జిన్నా సినిమాలు త‌న బ్యాన‌ర్లో రూపొంది ప్లాప్ చిత్రాలుగా మిగిలాయ‌ని ఆయ‌న అన్నారు. ఇంకా త‌న కెరీర్‌కు సంబంధించిన విష‌యాల‌పై ఎలాంటి సంచ‌నాల‌ను మాట్లాడుతారో చూడాలి. అలాగే చిరంజీవితో వైరం, మా ఎన్నికలు, చంద్రబాబుతో రాజకీయంగా దూరం పెరగటం వంటి పలు విషయాలపై మంచు కథానాయకుడు ఎలా స్పందించారో చూడాలి. అలాగే ప్ర‌స్తుతం ఆయ‌న మంచు ల‌క్ష్మితో క‌లిసి అగ్ని న‌క్ష‌త్రం అనే సినిమాలో న‌టించారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

నాలుగున్న‌ర ద‌శాబ్దాల అనుభ‌వ‌మున్న ఆయ‌న ఆదివారం రోజున 71వ పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. ఇంత సుదీర్ఘ‌మైన అనుభ‌వ‌మున్న మోహ‌న్‌బాబు ఇప్పుడు ప‌రిమిత సంఖ్య‌లోనే సినిమాల‌ను చేస్తున్నారు. న‌చ్చితే త‌ప్ప సినిమాలు చేయ‌టం లేదు. విద్యానికేత‌న్‌ను మోహ‌న్ బాబు యూనివ‌ర్సిటీగా మార్చారు. పేద విద్యార్థుల‌కు త‌న ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌లో ఫీజు రాయితీల‌ను కూడా క‌లిగిస్తున్నారు.

ఆయ‌న న‌ట వార‌సులుగా ల‌క్ష్మీ మంచు, విష్ణు మంచు, మంచు మ‌నోజ్ సినీ రంగ ప్ర‌వేశం చేసి త‌మ‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు.

నెక్ట్స్ సినిమాను ఆపేస్తా.. NTR 30పై ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్స్‌
for more updates follow this link:-bigtv

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×