E-Paper
Advertisement

Mani Ratnam: చిన్న కథలను అలాంటి హీరోతో తీయకూడదు: మణిరత్నం

Mani Ratnam: చిన్న కథలను అలాంటి హీరోతో తీయకూడదు: మణిరత్నం
Advertisement

Mani Ratnam: విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ఇటీవల ‘థగ్‌లైఫ్’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకే ఓ సినిమా రాగా.. ఇప్పుడు 37 ఏళ్ల తర్వాత ‘థగ్‌లైఫ్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ అవార్డు వేడుకలో దర్శకుడు మణిరత్నం ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

కమల్ హాసన్‌ లాంటి అగ్ర హీరోతో సినిమా తీయాలంటే ఆయన స్థాయికి తగ్గ కథ ఉండాలని మణిరత్నం అన్నారు. ఆయనతో కలిసి మరో సినిమా తీసేందుకు దాదాపు 37 ఏళ్లు పట్టిందని తెలిపారు. సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ నటుల్లో ఆయన ఒకరు.. అందువల్ల చిన్న చిన్న కథలను అలాంటి హీరోతో తీయకూడదని పేర్కొన్నారు. ఆయన స్థాయికి తగిన స్టోరీ ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని సంప్రదించాలని చెప్పారు. ఇప్పుడు ‘థగ్‌లైఫ్’తో మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం అని సినిమాపై అంచనాలు పెంచేశారు. ఆయన మాటలతో సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థమైపోతుంది. దీనిపై ఫ్యాన్స్ కూడా చాలా ఖుషీ అవుతున్నారు.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×