E-Paper
Advertisement

CM Revanth Reddy : సీఎం రేవంత్‌తో గూగుల్ వైస్ ప్రెసిడెంట్‌ భేటీ.. ఆ అంశాలపై చర్చ..

CM Revanth Reddy : సీఎం రేవంత్‌తో  గూగుల్ వైస్ ప్రెసిడెంట్‌ భేటీ.. ఆ అంశాలపై చర్చ..
Advertisement

CM Revanth Reddy : రహదారి భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) గూగుల్‌ (Google) ప్రతినిధులతో చర్చించారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ గూగుల్‌ ప్లాట్‌ఫాంల వినియోగంపై వారితో సీఎం చర్చించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో డిజిటల్ వ్వవస్థను అభివృద్ధి చేసేందుకు ఆసక్తి చూపారు. తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చేందుకు కావాల్సిన సాంకేతికత, నైపుణ్యాలు తమ వద్ద ఉన్నాయని చంద్రశేఖర్ సీఎంకు వివరించారు.

Advertisement

గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌తో పాటు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్ తివారీ, క్యాన్సర్ వైద్యులు చిన్నబాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

Related News

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

Big Stories

Advertisement
×