E-Paper
Advertisement

Thiruveer Wedding: సైలెంట్‌గా ‘మసూద’ నటుడి పెళ్లి.. నెట్టింట్లో ఫొటోలు వైరల్!

Thiruveer Wedding: సైలెంట్‌గా ‘మసూద’ నటుడి పెళ్లి.. నెట్టింట్లో ఫొటోలు వైరల్!
Advertisement

Tollywood Actor Thiruveer Wedding Photos Got Viral: టాలీవుడ్‌లో మరోక హీరో బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేశాడు. ‘మసూద’ మూవీలో హీరోగా నటించిన తిరువీర్ తాజాగా కల్పన రావు అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా తన హల్దీ, మెహందీ, పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే వీరిది ఎరేంజిడ్ మ్యారేజ్ ఆ.. లేక లవ్ మ్యారేజ్ ఆ అనేది తెలియలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది సెలబ్రెటీలు, అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక తిరువీర్ సినిమాల విషయానికొస్తే.. ‘బొమ్మల రామారం’ సినిమాతో నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయం కావడంతో.. అక్కడ నుంచి వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలే వచ్చాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

Advertisement

అయితే అతడికి రానా నటించిన ‘ఘాజీ’ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కూడా చిన్న చిన్న సినిమాల్లో నటించాడు. ఇక తొలిసారిగా ‘జార్జి రెడ్డి’ సినిమాలో విలన్‌గా నటించే ఛాన్స్ వచ్చింది. ఈ మూవీలో తిరువీర్ విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో అతడికి విలన్‌గా కూడా ఆఫర్లు వచ్చాయి. అక్కడ నుంచి కొన్ని సినిమాల్లో విలన్‌ పాత్రలో నటించి అందరి దృష్టిలో పడ్డాడు.

Also Read: కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ తో పనిలేదు.. “మసూద” నిరూపించింది: దిల్ రాజు

Advertisement

అతడి కెరీర్ టర్నింగ్ పాయింట్ నాని నటించిన ‘టక్ జగదీష్’. ఈ మూవీలో విలన్‌గా నటించిన తిరువీర్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా హీరోగా ఛాన్స్ కొట్టేశాడు. ‘మసూద’లో హీరోగా అవకాశం దక్కించుకున్నాడు. ఈ మూవీ సైలెంట్‌గా వచ్చి ఎవరూ ఊహించని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Also Read: Amitabh Bachchan: కల్కి కోసం అమితాబ్ ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే.. ?

మొత్తంగా మసూద మూవీ తిరువీర్ కెరీర్‌ని మార్చేసింది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన తిరువీర్ ఇప్పుడు హీరోగా మారి సూపర్ హిట్ సాధించాడు. అయితే ఇప్పుడు అతడి లైనప్‌లో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో పారాహుషార్, మోక్షపఠం కాగా మరొకటి ఇంకా తెలియాల్సి ఉంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×