BigTV English

PM Modi Vs Rahul on Wealth to Muslim: ఆస్తులు ముస్లింలకు.. తొలిదశ పోలింగ్.. ఎదురుగాలి..

PM Modi Vs Rahul on Wealth to Muslim: ఆస్తులు ముస్లింలకు.. తొలిదశ పోలింగ్.. ఎదురుగాలి..

PM Modi Vs Rahul on wealth to Muslim: సార్వత్రిక ఎన్నికల తొలిదశ ఎన్నికల పొలింగ్ తర్వాత నేతల మాటలు హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీ- విపక్ష కాంగ్రెస్‌ల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను ముస్లింలకు పంచుతారని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్రమోదీ. దేశ సంపదపై మొదటి అధికారం ముస్లింలదే అని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్  చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారాయన.


రాజస్థాన్‌లోకి బాంస్‌వాడా ఎన్నికల బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుని చొరబాటుదారులు, అధిక సంతానం ఉన్నవారికి ఇవ్వాలని చూస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇప్పుడు అర్బన్ నక్సల్స్ గుప్పిట్లో ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూస్తే అర్థమవుతుందన్నారు. ముఖ్యంగా మావోల ఆలోచన విధానం అందులో కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అక్కాచెల్లెళ్ల వద్ద ఎంత బంగారం ఉందో లెక్కిస్తారని, వారి సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేస్తారన్నారు విమర్శించారు.

ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా అదేస్థాయిలో రియాక్ట్ అయ్యింది. తొలిదశ ఎన్నికల పోలింగ్‌తో మోదీలో అసంతృప్తి పెరిగిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీ మానిఫెస్టోకు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోందన్నారు. దేశ ప్రజలు తమ సమస్యల ఆధారంగా ఓటు వేస్తారన్నారు. యువత, మహిళలు, దళితులు, రైతులకు సంబంధించిన అంశాలపై మాట్లాడకుండా సిగ్గులేని అబద్దాలు చెబుతున్నారని సీనియర్ నేత జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో హిందూ-ముస్లిం అని ఎక్కడ ఉందో చూపించాలని సవాల్ విసిరారు.


హిస్టరీలోకి వెళ్తే..

యూపీఏ హయాంలో 2006 డిసెంబర్ 9న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా వారికి సాధికారత కల్పిస్తూ వినూత్న ప్రణాళికలను తీసుకురానున్నట్లు తెలిపారు. దేశంలోని వనరులపై వారికే తొలి హక్కు ఉండాలని ప్రధాని చెబుతున్నట్లు అందులో ఉంది. ఈ వీడియోను బీజేపీ రిలీజ్ చేసింది.

Also Read: లైవ్‌లో యాంకర్‌కు ఊహించని పరిణామం

ముఖ్యంగా ప్రధాని ఏ ప్రాంతానికి వెళ్తే.. ఆ ప్రాంత సమస్యలను ప్రస్తావించకుండా అక్కడ వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారిందంటున్నారు కాంగ్రెస్ వాదులు. గత ఎన్నికల్లో ఉత్తరాదిలో పుల్వామా ఘటనను ప్రస్తావిస్తారని, వెస్ట్‌లో పాకిస్థాన్ ఇష్యూని తెరపైకి తెచ్చారని గుర్తు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో దక్షిణాది తమిళనాడులో కచ్చతీవు దీపులపై ప్రస్తావించారని చెబుతున్నారు. ప్రధాని మోదీ కామెంట్స్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ఫార్టీ. మరి పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఏం చేసిందనేది ప్రశ్న.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×