BigTV English

Tamannaah:- హీరోయిన్‌తో ఎంసీఏ విలన్ జల్సా.. తమన్నా లవ్‌లో పడ్డట్టేనా..?

Tamannaah:- హీరోయిన్‌తో ఎంసీఏ విలన్ జల్సా.. తమన్నా లవ్‌లో పడ్డట్టేనా..?

Tamannaah:- మిల్కీ బ్యూటీ తమన్నా లవ్ ట్రాక్‌లో పడినట్టుంది. అడిగితే చిర్రుబుర్రులాడుతోంది గానీ… దాదాపుగా లవ్‌లో పడిందనే అంటున్నారు చూసినవాళ్లంతా. ఎంసీఏ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన శివతో తమన్నా ప్రేమలో పడిందంటున్నారు. ఆ విలన్ అసలు పేరు విజయ్ వర్మ. మంచి టాలెంట్ ఉన్న యాక్టర్. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లోనూ టాలెంట్ చూపించాడు. గల్లీ బాయ్ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడు అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నాడు. పైగా విజయ్ వర్మది హైదరాబాదే.


ఇక తమన్నాతో రిలేషన్ విషయానికొస్తే.. హిందీలో ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ సీజన్ 2 షూటింగులో వీళ్లిద్దరికీ పరిచయం అయింది. అప్పటి నుంచి జనాల కంట పడుతూనే ఉన్నారు. న్యూ ఇయర్ రోజున ఏకంగా లిప్ కిస్ ఇచ్చుకున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా లవ్ ఎమోజీ షేర్ చేసుకున్నారు. అయినా సరే.. డేటింగ్ అని గాని, లవ్ అని గాని చెప్పడం లేదు. తాము రిలేషన్లో ఉన్నామన్నది కేవలం గాపిస్ మాత్రమేనని చెప్పింది తమన్నా. ఒకానొక సమయంలో మీడియా కవరేజ్ నుంచి ఈ ఇద్దరూ తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. కాని, ఇప్పుడు కాస్త తెగించినట్టు కనిపిస్తోంది. మీడియా చూస్తోందని తెలిసినా సరే.. రండి.. ఫొటోలు తీసుకోండి అన్నట్టుగానే ప్రవర్తించారు.

లేటెస్ట్‌గా ఈ ఇద్దరూ కలిసి ముంబయిలో ఓ రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లారు. డిన్నర్ చేసిన తరువాత విజయ వర్మనే స్వయంగా… తన కారులో తమన్నాను తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపాడు. ఏదో ఒకటి రెండుసార్లు కలుసుకుంటే గాసిప్స్ ఏం పుట్టవు. కాని, ఈ జంట ఎన్నిసార్లు కంటపడిందో తెలుసా. ఓసారి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. ముంబైలో జరిగిన ఓ సినీ ఫంక్షన్‌కు ఇద్దరూ కలిసే వెళ్లారు. మరోసారి డిన్నర్ చేస్తూ కనిపించారు. అందుకే, మీరిద్దరూ రిలేషన్లో ఉన్నారా అంటే పదే పదే అడుగున్నారు. అయినా సరే.. తమన్నా నుంచి గాని, విజయ్ వర్మ నుంచి గానీ ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.


బహుశా.. తమన్నా ఇప్పటికీ సినిమానే తన భవిష్యత్ అనుకుంటోంది, అందుకే, పెళ్లి చేసుకునే ఉద్దేశం కనిపించడం లేదనిపిస్తోంది. దీన్ని దాటవేయడానికే రిలేషన్ మ్యాటర్ చెప్పడం లేదని చెప్పుకుంటున్నారు. 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×