E-Paper
Advertisement

Mechanic Rocky Trailer: బలవంతంగా విశ్వక్ సేన్‌ను మెకానిక్‌గా మార్చిన తండ్రి.. ఇప్పుడు ఈ హీరో ఏం చేస్తాడో?

Mechanic Rocky Trailer: బలవంతంగా విశ్వక్ సేన్‌ను మెకానిక్‌గా మార్చిన తండ్రి.. ఇప్పుడు ఈ హీరో ఏం చేస్తాడో?
Advertisement

Mechanic Rocky Trailer: యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రతీ సినిమాకు డిఫరెంట్ జోనర్‌ను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేస్తున్నాడు. ఒకసారి లవ్ స్టోరీతో వస్తే.. మరొకసారి పక్కా మాస్ కమర్షియల్ సినిమాలతో వస్తున్నాడు. అలా ఇప్పటివరకు విశ్వక్ సేన్ నటించిన చాలావరకు సినిమాలు మినిమమ్ హిట్స్‌గా నిలిచాయి. అందుకే తన తరువాతి మూవీ ‘మెకానిక్ రాకీ’పై కూడా యూత్‌లో బాగానే అంచనాలు ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా బయటికొచ్చింది. టైటిల్‌కు తగినట్టుగా ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండగా.. కామెడీ కూడా ఈ సినిమాకు ప్లస్ కానుందని ట్రైలర్ చూస్తేనే క్లారిటీ వచ్చేస్తోంది.

ఇద్దరు భామలు

Advertisement

‘‘నువ్వేం ఫికర్ చేయకు నాన్న. నేను ఎలాగైనా సివిల్ ఇంజనీర్ అవుతా’’ అంటూ విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్‌తో ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ మొదలవుతుంది. ఇందులో విశ్వక్‌కు తండ్రిగా నరేశ్ నటించారు. ‘‘కంప్యూటర్ సైన్స్ చదివి సివిల్ ఇంజనీర్ అవుతావా’’ అంటూ షాకయ్యి తనను షెడ్‌లో మెకానిక్‌గా పనిలో పెడతారు. దేనికి పనికిరాడు అని తన తండ్రి తిడుతుండడంతో డ్రైవింగ్ స్కూల్ పెట్టి అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పించాలని ప్రయత్నిస్తాడు. అప్పుడే అక్కడికి డ్రైవింగ్ నేర్చుకోవడానికి శ్రద్ధా శ్రీనాథ్ వస్తుంది. తనకు అసలు రైట్, లెఫ్ట్‌కు తేడా కూడా తెలియదు. తన తర్వాత మీనాక్షి చౌదరీ కూడా డ్రైవింగ్ స్కూల్ జాయిన్ అవ్వగా తనతో లవ్ బిజినెస్ చేయడానికి ట్రై చేస్తాడు విశ్వక్ సేన్.

Also Read: సల్మాన్ ఖాన్ జాతకం ఇదే.. ఆ ముప్పు పొంచి ఉందా?

Advertisement

అంతా మెకానిక్ పోలికలే

ఉమెన్స్ డే, వాలెంటైన్స్ డే, అంబేద్కర్ జయంతి అంటూ సిల్లీ కారణాలతో ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ మీనాక్షి చౌదరీని లైన్‌లో పెట్టాలని చూస్తాడు విశ్వక్ సేన్ (Vishwak Sen). తనకోసం డ్యూయెట్స్ కూడా పాడతాడు. అప్పుడే ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ మరో మలుపు తిరుగుతుంది. విలన్‌గా సునీల్ ఎంటర్ అవుతాడు. విశ్వక్ సేన్ తన యాక్షన్‌తో అదరగొడతాడు. డైలాగ్స్‌లో కూడా విశ్వక్ సేన్ మెకానిక్ వర్షనే కనిపిస్తుంది. ఇక ‘మెకానిక్ రాకీ’లో విశ్వక్ సేన్ మాస్ వర్షన్ చూడబోతున్నామని ట్రైలర్‌తోనే క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. అయితే ఇది కేవలం మొదటి ట్రైలర్ మాత్రమే అని, ఇంకా మరికొన్ని ట్రైలర్స్ రాబోతున్నాయని చెప్పకనే చెప్పేశారు. అందుకే ఈ ట్రైలర్‌ను 1.0గా విడుదల చేశారు.

మరో హిట్

‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించగా.. రజినీ తాళ్లూరి దీనిని నిర్మించారు. ‘సరిపోదా శనివారం’తో టాలీవుడ్‌లో తన మార్క్ క్రియేట్ చేసిన జేక్స్ బిజాయ్.. ‘మెకానిక్ రాకీ’కి కూడా సంగీతాన్ని అందించారు. ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రేక్షకులకు నచ్చడానికి మ్యూజిక్ కూడా కీ రోల్ ప్లే చేసింది. అదే విధంగా ‘మెకానిక్ రాకీ’ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా నవంబర్ 22న విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో హైపర్ ఆది, వైవా హర్ష కామెడియన్లుగా నటించి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనున్నారు. ఇక ఈ మూవీతో విశ్వక్ మరో హిట్ కొట్టగలడా చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×