BigTV English
Advertisement

Salman Khan: సల్మాన్ ఖాన్ జాతకం ఇదే.. ఆ ముప్పు పొంచి ఉందా?

Salman Khan: సల్మాన్ ఖాన్ జాతకం ఇదే.. ఆ ముప్పు పొంచి ఉందా?

Salman Khan Horoscope: ప్రస్తుతం బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ ప్రాణాలకు హాని ఉందనే విషయమే ఇండస్ట్రీ అంతటా హాట్ టాపిక్‌గా మారింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వల్ల సల్మాన్ ప్రాణానికి ముప్పు ఉందనే విషయం గురించే ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ నిపుణులు సైతం మాట్లాడుకుంటున్నారు. అయితే బీ టౌన్‌లో సల్మాన్ ఖాన్ జాతకం ఒకటి ఇదే అంటూ వైరల్ అయ్యింది. ఆయన పుట్టిన తేదీ, సమయం చూసి అసలు సల్మాన్ జాతకం ఎలా ఉంటుందా అని కొందరు నిపుణులు పరీక్షిస్తున్నారు. దాని ద్వారా సల్మాన్ ఖాన్ గురించి, తన జాతకం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఆయనకు త్వరలోనే ఒక ముప్ప తప్పదని జాతకంలో ఉన్నట్టు తెలుస్తోంది.


ప్రత్యర్థులే గెలుస్తారు

సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉందని ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే తెలుస్తోంది. అయితే తన జాతకంలో కూడా అదే ఉందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇప్పట్లో ఆ ప్రాణహాని తప్పేలా లేదని కూడా అంటున్నారు. 2025 వరకు సల్మాన్ ఖాన్ చాలా జాగ్రత్తగా ఉండాలని, అలా లేకపోతే తన ప్రత్యర్థుల కుట్రే గెలుస్తుందని తెలిపారు. ఇక ఇప్పుడు సల్మాన్‌కు ప్రత్యర్థులు, శత్రువులు ఎవరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పేరు లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) అని, ఎన్నో ఏళ్లుగా తన గురి సల్మాన్‌పైనే ఉందని బాలీవుడ్‌లో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. తను జైలులో ఉండి కూడా సల్మాన్ ఖాన్‌పై పలుమార్లు హత్యాయత్నానికి ప్రయత్నించాడు బిష్ణోయ్.


Also Read: సల్మాన్ చెల్లెలికి కూడా బెదిరింపులు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న కుటుంబం..!

చాలాసార్లు తప్పించుకున్నాడు

సల్మాన్ ఖాన్‌ (Salman Khan)ను ఎప్పటికైనా చంపేస్తానని ఎన్నో ఏళ్ల క్రితమే ఓపెన్‌గా వార్నింగ్ ఇచ్చాడు లారెన్స్ బిష్ణోయ్. ఇప్పటికీ పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సల్మాన్‌ను భయటపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇప్పటికే ఎన్నోసార్లు బిష్ణోయ్ చేసిన హత్యాప్రయత్నాలు నుండి సల్మాన్ తప్పించుకున్నాడు. ఇక జ్యోతిష్యులు కూడా అదే విషయాన్ని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది వరకు సల్మాన్ ఖాన్ చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. ఇప్పటికే తన సెక్యూరిటీని పెంచుకున్నాడు ఈ బాలీవుడ్ హీరో. బులెట్ ప్రూవ్ కార్లలో తిరుగుతున్నాడు. సినిమాల షూటింగ్ సెట్స్‌లో ఎప్పుడూ తన సెక్యూరిటీనే తనకు కాపుకాస్తుంటుంది.

హోస్ట్‌గా కూడా బాధ్యతలు

సల్మాన్ సోదరి అర్పితకు కూడా బెదిరింపులు వచ్చాయని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తను ఉన్న ఇంటిని అమ్మేసి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో బీ టౌన్ మొత్తం ఈ గండం నుండి సల్మాన్ ఖాన్ అసలు ఎలా బయటపడతాడా అనే ఆలోచనలోనే ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ 18 (Bigg Boss 18)కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు సల్మాన్. ఎప్పటినుండో ఉన్న కమిట్మెంట్ కావడంతో తను వీకెండ్స్.. ఈ షోను హోస్ట్ చేయక తప్పదు. అక్కడికి కూడా ఫుల్ సెక్యరూరిటీతోనే వెళ్తున్నాడు ఈ హీరో. ఇక జాతకం ప్రకారం తనకు ఇంకెన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో అని ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×