BigTV English

Diwali Movies: దీపావళికి.. తెలుగింట డబ్బింగ్ సినిమాల మోత…

Diwali Movies: దీపావళికి.. తెలుగింట డబ్బింగ్ సినిమాల మోత…

Diwali Movies: పండగ సీజన్ వస్తుంది అంటే సినీ లవర్స్ కి నిజంగా పండుగగానే ఉంటుంది. ఎందుకంటే థియేటర్లు వరుస చిత్రాలతో కలకలలాడుతాయి కాబట్టి. మొన్న దసరాకి బాలయ్య, రవితేజ మూవీస్ తో థియేటర్లు పండగ వాతావరణం సంతరించుకున్నాయి. ఇక దీపావళికి చిన్న సినిమాలు సందడి చేస్తాయి అని ఆశిస్తున్న సినీ ప్రేక్షకులకు నిరాశ మిగులుతుంది. మన పండక్కి పక్క రాష్ట్రం టపాసులు సిద్ధమవుతున్నాయి.


ఈ దీపావళికి చిన్న సినిమాలు కాదు కదా అసలు తెలుగు సినిమాలే సరిగ్గా లేవు. శ్రీ లీల, వైష్ణవ తేజ కాంబోలో తెరకెక్కిన ఆదికేశవ చిత్రం తప్ప తెలుగులో దీపావళికి రిలీజ్ కాబోయే సినిమాలు లేనేలేవు. ఈసారి థియేటర్లలో డబ్బింగ్ చిత్రాల హడావిడి ఎక్కువగా ఉంది. టైగర్ 3, జిగర్తాండా డబల్ ఎక్స్, జపాన్ ఇలా వరుసగా డబ్బింగ్ టపాసులే థియేటర్లలో పేలుతాయి. అవతల మూవీస్ లో ఉంది ఎంత క్రేజ్ ఉన్న హీరోలైనా.. టాలీవుడ్ హీరోల సినిమాలు పడితేనే కదా పండగ కిక్ ఉంటుంది .

నాని, మృణాల్ ఠాకూర్ కాంబోలో తెరకెక్కి న హాయ్ నానా చిత్రం.. నితిన్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్.. డిసెంబర్ లో విడుదల అవుతున్న నేపథ్యంలో దీపావళికి తెలుగు సినిమాల హడావిడి ఏ మాత్రం కనిపించడం లేదు. ప్రభాస్ సలార్ చిత్రం ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ చివరికి డిసెంబర్ కి చేరుకుంది. మరి అప్పుడైనా విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి. ఒకపక్క పాన్ ఇండియన్ ట్రెండ్ బాగా ఫేమస్ అయిపోవడంతో మిడిల్ టైర్ హీరోలు కూడా తమ సినిమాలను పెద్ద రేంజ్ లో రిలీజ్ చేయాలి అని ఆశిస్తున్నారు. దీంతో మంచి పిక్ పీరియడ్ ని మిస్ చేసుకుంటున్నారు.


ఒకపక్క మన సినిమాలు ప్రపంచం దృష్టి తమ వైపు తిప్పుకొని అవార్డుల వర్షం కురిపిస్తుంటే.. తెలుగు నాట థియేటర్లలో మాత్రం పండుగ సమయానికి డబ్బింగ్ సినిమాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఇలా తమిళ్ సినిమాల డామినేషన్ పెరగడం ఆందోళనకరమైన విషయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే మొన్న విజయ్ లియో చిత్రానికి ఎక్కువ థియేటర్లు ఇవ్వడం వల్ల రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రం నష్టపోయింది. పాన్ ఇండియా మోజులో పడి మన మూవీ మేకర్స్ బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమాలను నిలబెట్టాలి అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇకనైనా ఈ విషయం పట్ల సినీ పెద్దలు కాస్త ఆలోచించాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×