BigTV English

Mega Fans – Allu Arjun: ఎలా తగ్గవో చూస్తాం.. బన్నీకి మెగా ఫాన్స్ ఛాలెంజ్

Mega Fans – Allu Arjun: ఎలా తగ్గవో చూస్తాం.. బన్నీకి మెగా ఫాన్స్ ఛాలెంజ్

Mega Fans – Allu Arjun: ఓ వైపు పుష్ప.. తగ్గేదే లే.. అంటున్నాడు.. కానీ నువ్వు ఎలా తగ్గవో మేము చూస్తాం అంటున్నారు మెగా ఫ్యాన్స్.. డిసెంబర్ 5న పుష్ప-2 సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు మేకర్స్. దీనిపై చాలా ఎక్స్ పర్టెషన్స్ పెట్టుకున్నారు పుష్ప టీం అండ్ ఫ్యాన్స్.. కానీ మెగా ఫ్యాన్స్ ఫైర్ చూస్తుంటే అసలు సినిమా అడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.


నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు అల్లు అర్జున్ సపోర్ట్ చేసినప్పుడు మొదలైన రచ్చ.. అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య రచ్చకు దారి తీసింది. ఇప్పుడు పుష్ప -2 సినిమా రిలీజ్ గడియలు మొదలుపడటంతో.. నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. దేశవ్యాప్తంగా సినిమాకు బజ్ ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పుష్ప-2 హంగామా కనిపించడం లేదు. దీంతో ఓపెనింగ్స్ దక్కవేమో అన్న టెన్షన్ లో ఉన్నారు పుష్ప-2 నిర్మాతలు.. ఇప్పటికే పుష్ప-2 పోస్టర్, ట్రైలర్, పాటలపై నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదే నిర్మాతల్లో టెన్షన్ రెకెత్తిస్తోంది.

ఇక మెగా ఫ్యాన్స్ ను బుజ్జగించేందుకు పుష్ప 2 నిర్మాతలు రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం అల్లు అరవింద్, బన్నీ వాసు పవన్ కల్యాణ్ ను కలిశారు. కానీ పవన్ నుంచి ఆశించిన హామీ దక్కకపోవడంతో.. చిరంజీవి ద్వారా లైన్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ చిరంజీవిని కలవనుంది పుష్ప టీమ్. ఇవాళ సాయంత్ర జరిగే పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవిని ఆహ్వానించాలని నిర్ణయించారు. చిరంజీవి రాకతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూ సిగ్నిల్ ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. కానీ చిరంజీవి హాజరవుతారా.. లేదా అన్న సస్పెన్స్ గా మారింది.


Also Read: మెగాస్టార్ తో ‘పుష్ప 2’ టీం మంతనాలు… చిరు కరుణిస్తాడా?

పుష్ప పార్ట్ 1 తో నేషనల్ అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్ అదే స్పీడ్ తో పుష్ప-2తో తన క్రేజ్ ను పెంచుకోవాలని చూస్తున్నారు. కానీ.. పుష్ప ఫైర్ మీద ఉన్నప్పుడు నాగబాబు ఓ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. స్వామి వివేకానంద చెప్పిన ఒక విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పెట్టారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు తప్పు మార్గంలో ఉన్నారని గుర్తించి, వెంటనే మీ తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే మళ్లీ మీరు మీ మూలాలను కలుసుకోవడం కష్టం అవుతుంది అంటూ కొటేషన్ రాశారు. అయితే ఇది పరోక్షంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ పెట్టారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. తప్పు తెలుసుకున్న అల్లు అర్జున్ అండ్ పుష్ప టీమ్.. మెగా కాంపౌండ్ లో చక్కర్లు కొడుతున్నారని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి వీటికి ఏ విధంగా ఫుల్ స్టాప్ పడబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది.

మరోవైపు పుష్ప-2 ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యూసుఫ్‌గూడ బెటాలియన్ పోలీస్ లైన్స్‌లో ‘పుష్ప-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీంతో హైదరాబాద్ పోలీసులు ప్రయాణికుల కోసం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సినీ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దీంతో కేవీబీఆర్ స్టేడియం, చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×