E-Paper
Advertisement

Pawan Kalyan: ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి.. పవన్ కల్యాణ్‌కు చిరు బర్త్ డే విషెస్

Pawan Kalyan: ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి.. పవన్ కల్యాణ్‌కు చిరు బర్త్ డే విషెస్
Advertisement

Happy Birthday Powerstar Pawan Kalyan: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రేక్షకులు, అభిమానులు, పార్టీ క్యాడర్, రాష్ట్ర ప్రజలు ఇలా చాలా మంది పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకలను వినూత్న రీతిలో జరుపుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్.. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు.

అపజయాలకు కుంగిపోలేదు.. విజయాలకు పొంగిపోనూ లేదు. ఎన్నెన్నో విమర్శలు, ఎన్నెన్నో వివాదాలు, మరెన్నో కష్టాలు ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడి నెగ్గాడు. ఇక ఇవాళ అంటే సెప్టెంబర్ 2న ఆయన బర్త్ డే కావడంతో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు విషెస్ తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ఆయనకు స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ పుట్టిన రోజు ఇంతకు ముందులా కాకుండా ఇది మరీ ప్రత్యేకం అని చెప్పుకొచ్చాడు. ఈరోజుల్లో పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు కావాలి అని ప్రశంసించాడు.

Advertisement

ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ట్విట్టర్ (ఎక్స్‌)లో తన తమ్ముడు పవన్‌కు విషెస్ చెబుతూ ఓ నోట్ రాసుకొచ్చాడు. ‘‘కళ్యాణ్ బాబు.. ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది’’ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. చిరూ ట్వీట్‌తో మెగా ఫ్యాన్స్ అండ్ రాష్ట్ర జనసేన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read: పవన్ కళ్యాణ్ ఎందుకంత పవర్..బర్త్ డే స్పెషల్

Advertisement

ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ఓ వైపు రాష్ట్ర బాగోగులు చూసుకుంటూనే.. మరోవైపు తన లైనప్‌లో ఉన్న సినిమాలను క్లియర్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం పవన్ లైనప్‌లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో యంగ్ దర్శకుడు సుజీత్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ‘ఓజీ’ పేరుతో వస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పవన్ కల్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించబోతుండటంతో ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అంచనాలు పెంచేశాయి. ఫుల్ మాస్ యాక్షన్ లుక్‌లో కనిపించిన పవన్.. మార్షల్ ఆర్ట్‌ స్టిల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ముక్తకంఠంతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత తన లైనప్‌లో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అవి ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీరమల్లు. ఈ రెండు సినిమాలు కూడా త్వరలో పూర్తి చేస్తాడని తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×