BigTV English

ED Raids: ఏఏపీకి మరిన్ని కష్టాలు.. ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. ఈసారి..

ED Raids: ఏఏపీకి మరిన్ని కష్టాలు.. ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. ఈసారి..

ED Raids: ఆమ్ ఆద్మీ పార్టీకి కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఆ పార్టీ నేతలకు కష్టాలు తప్పలేదు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ ఇంటిపై ఈడీ సోదాలు చేస్తోంది. సోమవారం ఉదయం రంగంలోకి దిగిన ఈడీ టీమ్‌లు.. ఎమ్మెల్యే ఇంటితోపాటు బంధువుల ఇళ్లపై ఏకకాలంలో తనిఖీలు చేస్తోంది.


అసలు విషయం ఏంటంటే.. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నసమయంలో అమానతుల్లాఖాన్‌పై తీవ్రమైన ఆరోపణలు వెళ్లువెత్తాయి. ఆయన హయాంలో నియమకాలు, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలోని ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ ఇంటిలో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. అంతుకుముందు ఆయన ఇంటి ముందు బలగాలు భారీగా మొహరించాయి.

ఈడీ సోదాలకు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్. తనను అరెస్ట్ చేయడానికి అధికారులు ఇప్పుడే వచ్చారని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మోదీ సర్కార్ తమ పార్టీ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. నిజాయితీగా ప్రజలకు సేవ చేయడం నేరమా అంటూ ప్రశ్నించారు. ఇంకెంత కాలం ఇలాంటి పాలన సాగుతుందని ధ్వజమెత్తారు.


ALSO READ: రాజకీయాలలోనూ క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు

మరోవైపు ఈడీ సోదాలను ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. రాజకీయ కుట్రలో భాగంగా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్‌సింగ్ ఆరోపించారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ సోదాలు చేయడం దారుణమన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఏఏపీకి సంబంధించి పెద్ద నేతలను టార్గెట్‌గా చేస్తూ వస్తోంది. తాజాగా ఎంపీలు, ఎమ్మెల్యేల వంతు అయినట్టు కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహర్ జైలులో ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దాదాపు ఐదారు నెలలు తర్వాత బెయిల్‌పై విడుదలైన విషయం తెల్సిందే.

ఇప్పుడు ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ వంతైంది. ఏఏపీ కీలకమైన నేతల్లో అమానతుల్లాఖాన్‌ కూడా ఒకరు. అందుకే ఆయనను మోదీ సర్కార్ టార్గెట్ చేసిందన్నది ఆ పార్టీ నేతలమాట. అధికారుల సోదాల జాబితాలో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×