BigTV English

Chiru upcoming movies : మెగాస్టార్ న్యూ మూవీస్ పై క్లారిటీ .. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Chiru upcoming movies : మెగాస్టార్ న్యూ మూవీస్ పై క్లారిటీ .. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..
Megastar Chiranjeevi upcoming movies

Megastar Chiranjeevi upcoming movies(Telugu Cinema News) :

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేళ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. చిరు కుమార్తె సుస్మిత కొణిదెల సొంత బ్యానర్‌పై నిర్మించే సినిమాపై క్లారిటీ వచ్చింది. చిరు నటించబోయే మరో సినిమాపై అప్‌డేట్‌ వచ్చింది. ఆ వివరాలను ప్రొడక్షన్‌ హౌస్‌లు షేర్‌ చేశాయి. మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి.


చిరంజీవి.. మెగా156 తమ బ్యానర్‌లో చేస్తున్నారని తెలుపుతూ గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ట్వీట్‌ చేసింది. 4 దశాబ్దాలుగా వెండితెరను శాసిస్తున్న రాజసంగా చిరును పేర్కొంది. బంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి అంటూ ప్రశంసించింది. ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ డైరెక్టర్ అని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

చిరంజీవి 157వ సినిమా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందనుంది. ఈ విషయాన్ని ఆ నిర్మాణ సంస్థ ప్రకటిస్తూ ట్వీట్‌ చేసింది. మెగా స్టార్‌ కోసం పంచభూతాలు ఏకం కానున్నాయని పేర్కొంది. ఈ మూవీ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. పోస్టర్ ను పరిశీలిస్తే సోషియో ఫాంటసీ మూవీలా అనిపిస్తోంది. బింబిసార మూవీని తెరకెక్కించిన వశిష్ఠ ఈ మూవీకి డైరెక్టర్.


మెగా 157 కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారని తెలుస్తోంది. మెగాస్టార్ ను పంచభూతాలకు అధిపతిలా చూపుతారా..? పంచభూతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్న మానవుడిలా చూపుతారా? అనే ఆసక్తి నెలకొంది. ‘విశ్వానికి మించి..’ అంటూ పోస్టర్‌ na పేర్కొని సినిమాపై భారీ అంచనాలపై పెంచేశారు. తమ అభిమాన హీరో కొత్తసినిమాలపై అప్ డేట్స్ రావడంతో మెగాఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×