E-Paper
Advertisement

Keeravani: వర్మే నా ఫస్ట్ ఆస్కార్.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆర్జీవీ ఏమన్నారంటే?

Keeravani: వర్మే నా ఫస్ట్ ఆస్కార్.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆర్జీవీ ఏమన్నారంటే?
Advertisement

Keeravani: రాంగోపాల్ వర్మ.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. వివాదాలు అతని వెంట రావడం కాదు.. వివాదాలనే అతడు వెతుక్కుంటూ వెళ్తాడు. నిత్యం ఏదో ఒక అంశంపై తనదైనస్టైల్‌లో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. అతడిని ప్రేమించే వారికంటే ద్వేశించే వారే ఎక్కువ. అలాంటి వ్యక్తిని దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి దేవుడితో పోల్చాడు. పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్‌ను ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీరవాణి.. రామ్ గోపాల్ వర్మే తన మొదటి ఆస్కార్ అని అన్నారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన క్షణం క్షణం సినిమా తన కెరీర్‌కు మంచి ఊతాన్ని ఇచ్చిందని వెల్లడించారు.

Advertisement

‘‘ఇప్పుడు వచ్చిన అవార్డ్ నాకు రెండోది. రాంగోపాల్ వర్మే నా మొదటి ఆస్కార్. నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశాల కోసం ఎంతో మందిని కలిశాను. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. నా మ్యూజిక్ క్యాసెట్లను చెత్తబుట్టలో పడేశారు. అటువంటి సమయంలో రామ్ గోపాల్ వర్మ తన క్షణం క్షణం సినిమాలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నాకు అవకాశాలు క్యూ కట్టాయి. రామ్ గోపాల్ వర్మ నా కెరీర్‌లో ఆస్కార్ పాత్ర పోషించారు. ఆయనే నా మొదటి ఆస్కార్’’ అని వెల్లడించారు కీరవాణి.

ఇక దీనిపై ఆర్జీవీ తనదైనశైలిలో స్పందించారు. కీరవాణి వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘‘నేను చనిపోయిన భావన కలుగుతోంది. ఎందుకంటే చనిపోయిన వాళ్లనే ఇంత గొప్పగా పొగుడుతారు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×