BigTV English

Green Goods:-ప్రపంచవ్యాప్తంగా నష్టం.. ఆ ఒక్క రంగానికి మాత్రం లాభం..

Green Goods:-ప్రపంచవ్యాప్తంగా నష్టం.. ఆ ఒక్క రంగానికి మాత్రం లాభం..


Green Goods:- 2020 అనేది ప్రపంచవ్యాప్తంగా ఎవరూ మర్చిపోలేని సంవత్సరంగా మారిపోయింది. కోవిడ్ అనే మహమ్మారి ఒక్కసారిగా ప్రపంచాన్ని కుదిపేసింది. వ్యక్తిగతంగానే కాకుండా ప్రతీ రంగాన్ని నష్టాల్లోకి తోసింది. ఇప్పటికీ కోవిడ్ ఎఫెక్ట్ కొన్ని రంగాలపై ప్రభావం చూపిస్తూనే ఉంది. ఇంకా కొన్ని రంగాలు కోవిడ్ మిగిల్చిన నష్టం నుండి కోలుకోలేకపోతున్నాయి. కానీ అన్నింటితో పోలిస్తే ఒక రంగం మాత్రం లాభాల్లోనే ఉందని నిపుణులు చెప్తున్నారు.

పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో గమనిస్తున్న చాలామంది.. తమవంతు సాయాన్ని చేయాలనుకుంటున్నారు. అందుకే చాలా విషయాల్లో పర్యావరణానికి హాని కలిగించని మార్గాలను ఎంచుకుంటున్నారు. అందులో ఒకటి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ గూడ్స్‌ను కొనుగోలు చేయడం. 2022 చివర్లో గ్లోబల్ ట్రేడ్ అనేది కుప్పకూలిపోయినా.. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గూడ్స్‌కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ ఒక్క రంగం మాత్రం 2022 చివర్లో లాభాలను చూసిందని యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ తెలిపింది.


యూఎన్ ఇచ్చిన లేటెస్ట్ గ్లోబల్ ట్రేడ్ అప్డేట్ ప్రకారం గ్రీన్ గూడ్స్‌కు ఉన్న వాల్యూ రోజురోజుకీ పెరిగిపోతోంది. గ్రీన్ గూడ్స్ అనేవి తక్కువ కాలుష్యాన్ని గాలిలోకి వదిలే వనరులతో తయారు చేయబడతాయి. అయితే 2022 చివర్లో గ్రీన్ గూడ్స్ వాల్యూ 4 శాతం పెరిగిందని తెలుస్తోంది. అంటే 1.9 ట్రిలియన్ లాభాలను గ్రీన్ గూడ్స్ అందుకున్నాయని గ్లోబల్ ట్రేడ్ ప్రకటించింది. ఒకవిధంగా ఇది మంచిదే అని పర్యావరణాన్ని, వాతావరణ మార్పులను అదుపులో ఉంచడానికి ఈ గూడ్స్ ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు.

ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికిల్స్, నాన్ ప్లాస్టిక్ ప్యాకేజెస్, విండ్ టర్బైన్స్ లాంటి గ్రీన్ గూడ్స్ 2022లో బాగా అమ్ముడుపోయాయాని గ్లోబల్ ట్రేడ్ అంటోంది. ఇండస్ట్రీ లెవల్ నుండే గ్రీన్ గూడ్స్ బిజినెస్ బాగా కొనసాగితే.. గాలిలో కాలుష్యం శాతాన్ని 2030లోపు తగ్గించాలనుకునే పర్యావరణవేత్తల టార్గెట్ చాలావరకు పూర్తయినట్టే అని నిపుణులు చెప్తున్నారు. కానీ ఇలాగే కొనసాగితే మాత్రం.. గ్రీన్ గూడ్స్ మాత్రమే లాభాల్లో ఉండి ఇతర రంగాలు మాత్రం నష్టం చవిచూడాల్సి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఆస్ట్రానాట్స్ కండరాలపై ప్రత్యేక పరిశోధనలు..

for more updates follow this link:-bigtv

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×