Jewel Thief: సూపర్ స్టార్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్ కృష్ణసాయి ( Krishna Sai) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’ ( Jewel Thief ). Beware of Burglar అనేది సబ్ టైటిల్. ఈ మూవీలో మీనాక్షి జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యాంకాక్ లో పాటలను గ్రాండ్ గా చిత్రీకరించారు.. ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ డేట్ ఎప్పుడో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇకపోతే ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ , ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో కృష్ణ సాయి డాన్స్ , మేనరిజమ్స్ , హెయిర్ స్టైల్ సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేస్తుండటం విశేషం. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సినిమాను నవంబర్ 8న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటీనటులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రీసెంట్ గా ఈ సినిమా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా చిత్ర నిర్మాత మల్లెల ప్రభాకర్ .. ‘జ్యువెల థీప్ ‘ మూవీ చాలా బాగా వచ్చింది. కథ , స్క్రీన్ ప్లే , ఎం ఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ మా సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.. ఇటీవలే రిలీజైన ట్రైలర్ ,ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా సెన్సార్ బోర్డు ప్రశంసలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ మూవీలో హీరో నటన హైలెట్ గానుంది..ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు వస్తుంది.. ఆయనతో పాటు సీనియర్ నటీనటులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి బాగా నటించారు. ‘జ్యువెల్ థీఫ్’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. నవంబర్ 8 న విడుదల కాబోతున్న మా సినిమా ఈ తరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరు థియేటర్ లో ‘జ్యువెల్ థీఫ్’ సినిమా చూసి మా టీమ్ ను సపోర్ట్ చెయ్యాలని అన్నారు… ఇక ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడారు. మరి ఇప్పుడు అందుకున్న రెస్పాన్స్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..