E-Paper
Advertisement

Movies : ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే మూవీస్ ఏంటో తెలుసా..!

Movies : ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే మూవీస్ ఏంటో తెలుసా..!
Advertisement

Movies : ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో ఆసక్తికర సినిమాలు సందడి చేయనున్నాయి. అలాగే వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో అలరించనున్నాయి. తెలుగు చిత్రాలతోపాటు డబ్బింగ్‌ మూవీస్ అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

అన్నీ మంచి శకునములే..
కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన మూవీ.. అన్నీ మంచి శకునములే. సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జోడిగా నటించారు. ఈ మూవీని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నందినిరెడ్డి తెరకెక్కించారు. ఈ సినిమాను స్వప్న దత్‌, ప్రియాంక దత్‌ నిర్మించారు. ఈ మూవీ మే 18 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisement

బిచ్చగాడు వస్తున్నాడు..
బిచ్చగాడు సినిమాతోనే తెలుగులోనూ మార్కెట్ సాధించిన హీరో విజయ్‌ ఆంటోని. ఆ చిత్రానికి సీక్వెల్‌గా బిచ్చగాడు-2 రెడీ అయ్యింది. హీరో నటిస్తూ స్వీయ దరకత్వంలో విజయ్ ఆంటోని ఈ మూవీని తెరకెక్కించాడు. కావ్యా థాపర్‌ కథానాయికగా నటించింది. ఈ సినిమా మే 19న విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ /వెబ్‌సిరీస్‌లు

Advertisement

అక్కినేని అఖిల్‌ నటించిన తాజా చిత్రం ఏజెంట్‌ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ సోనీలివ్‌ లో మే 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వివాహం తర్వాత నిహారిక కొణిదెల.. డెడ్‌ పిక్సెల్స్‌ వెబ్‌ సిరీస్‌తో నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది. వైవా హర్ష, అక్షయ్‌ లింగుస్వామి, సాయి రోణక్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య మండల దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్‌ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో..
మోడ్రన్‌ లవ్‌ చెన్నై (తమిళ్‌)-మే 18
సోనీ లివ్‌..
కడిన కదోరమీ అంద కదహం (మలయాళం)- మే 19

నెట్‌ఫ్లిక్స్‌..
అయాలవాషి (మలయాళం)-మే 19
కథల్‌ (హిందీ)- మే 19
బయీ అజైబి (ఇంగ్లీష్‌)- మే 19
మ్యూటెడ్‌ (ఇంగ్లీష్‌)- మే 19

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×