BigTV English

Foxconn : ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌కు భూమి పూజ.. ఇక్కడ ఏం తయారవుతాయంటే..?

Foxconn : ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌కు భూమి పూజ.. ఇక్కడ ఏం తయారవుతాయంటే..?


Foxconn : హైదరాబాద్‌ శివారు కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ పరిశ్రమకు తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యాంగ్‌ లియూ పాల్గొన్నారు. రూ.1,655 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభమైతే సుమారు 35 వేల మందికిపైగా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ ప్రతినిధులు గతంలోనే ప్రకటించారు.

తొమ్మిదేళ్లుగా రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతోందని కేటీఆర్ అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలిపారు. దేశంలోని ఐటీ ఉద్యోగాల్లో ప్రతి మూడింట్లో ఒక ఉద్యోగం మనదేనని వివరించారు. మరో పదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.


ఒప్పందం ప్రకారం రెండున్నర నెలల్లోనే ఫాక్స్‌కాన్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేశామన్నారు కేటీఆర్. సంస్థకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏడాదిలోగా ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ కంపెనీలో మొదటి దశలో 25 వేల ఉద్యోగాలు లభిస్తాయన్నారు. యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ తెలిపారు.

మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే పేరున్న సంస్థ ఫాక్స్‌కాన్‌. 70 శాతం యాపిల్‌ ఐఫోన్లను ఫాక్స్‌కాన్‌ కంపెనీయే తయారు చేస్తోంది. యాపిల్‌ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్‌కాన్‌కు భారీ ఆర్డర్‌ వచ్చింది. వచ్చే ఏడాది చివరినాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు మొబైల్‌ ఫోన్ల తయారీకే ఫాక్స్‌కాన్‌ ప్రాధన్యం ఇచ్చింది. ఇప్పుడు ఎయిర్‌పాడ్‌ల తయారీలోకి అడుగు పెడుతోంది. ఎయిర్‌పాడ్‌లు, వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్ల తయారీ ఆర్డర్‌ను యాపిల్ ఫాక్స్‌కాన్‌కు అప్పగించింది. ఇటీవల ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియూ నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధిబృందం సీఎం కేసీఆర్ తో పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×