E-Paper
Advertisement

Mr Bachchan: అందంతోనే కాదు..డబ్బింగ్‌తోనూ ఆకట్టుకున్న ‘బచ్చన్’ హీరోయిన్

Mr Bachchan: అందంతోనే కాదు..డబ్బింగ్‌తోనూ ఆకట్టుకున్న ‘బచ్చన్’ హీరోయిన్
Advertisement
Mr Bachchan Heroine dubbing: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ ని పూర్తి చేసింది.
అయితే, తన క్యారెక్టర్ కి సొంతంగా డబ్బింగ్ చేశారు. తెలుగు తన మాతృభాష కాకపోయినప్పటికీ కష్టపడి నేర్చుకొని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. భాగ్యశ్రీ డెడికేషన్, ప్రొఫెషనలిజంను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే సితార్, రెప్పల్ డెప్పల్ సాంగ్స్, టీజర్ లో తన బ్యూటీఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
ప్రస్తుతం భాగ్యశ్రీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమెను ప్రస్తుతం టాలీవుడ్ అప్ కమింగ్ క్రేజీ హీరోయిన్ అంటూ పొగడ్తలు చేస్తున్నారు. భాగ్యశ్రీ పెర్ఫార్మెన్స్ ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా..మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×