E-Paper
Advertisement

Man Burns Woman| పెళ్లికి నిరాకరించిన 40 ఏళ్ల ప్రియురాలు.. బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తామని..

Man Burns Woman| పెళ్లికి నిరాకరించిన 40 ఏళ్ల ప్రియురాలు.. బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తామని..
Advertisement

Man Burns Woman| భర్త నుంచ విడిపోయి జీవనం సాగిస్తన్న మహిళను అతను ప్రేమించాడు. కొన్నాళ్లు ప్రేమించిన తరువాత ఆమె సమాజ భయంతో అతడితో పెళ్లికి నిరాకరించిది. అయినా పట్టువదలక ఆమె కోసం నాలుగేళ్లు ఎదురుచూశాడు. అయినా ఆమె ఒప్పుకోకపోవడంతో.. ఆ భగ్న ప్రేమికుడు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఆమెపై పెట్రోల్ పోసి.. ఆ తరువాత మరింత దారుణానికి ఒడిగట్టాడు.

వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ కి చెందిన 40 ఏళ్ల మహిళ తన భర్తతో ఎనిమిదేళ్ల క్రితం విడిపోయి రాంఝీ ప్రాంతంలో ఒక పూల దుకాణం నడుపుకొని జీవనం సాగిస్తోంది.
ఆ సమయంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న నరేంద్ర పంజాబీ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. అయితే ఆమెకు భర్త వల్ల ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Advertisement

ఒకరోజు నరేంద్ర ఆమెను పెళ్లి చేసుకుందామని అడిగాడు. కానీ ఆమె పెళ్లికి నిరాకరించింది. ముగ్గురు పిల్లలుండగా.. మళ్లీ పెళ్లి చేసుకోవడం సరికాదని ఆమె కారణం చెప్పింది. దీనికి నరేంద్ర.. ఆమె పిల్లలకు తండ్రిగా ఉంటానని చెప్పాడు. అయినా ఆమె సమాజ భయంతో ఒప్పుకోలేదు. నరేంద్ర ఆమెను ప్రాణపదంగా ప్రేమించాడు. అందుకే ఆమె ఎప్పటికైనా తనతో వివాహానికి ఒప్పుకుంటుంది కదా.. ఎదురు చూశాడు. అలా వారిద్దరూ పెళ్లి చేసుకోకపోయినా ప్రేమికులుగా కొనసాగారు. అయితే ఇటీవల ఒకరోజు నరేంద్ర ఆమెతో సీరియస్ గా అడిగాడు. ఇప్పటికైనా తనతో పెళ్లికి ఒప్పుకోమని. కానీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో నరేంద్ర వెంటనే వెళ్లి ఒక డబ్బాలో పెట్రోల్ తీసుకువచ్చి.. ఆమెను మరోసారి పెళ్లి చేసుకోమని అడిగాడు.

అయినా ఆమె నిరాకరించింది. ఆ సమయంలో ఉద్రేకంలో ఉన్న నరేంద్ర.. ఆ డబ్బాలో ఉన్న పెట్రోల్ ని ఆమెపై పోసి నిప్పంటించాడు. ఆ తరువాత తనపై కూడా పోసుకొని ఆత్మహత్య చేసుకోబోయాడు. అలా వారిద్దరూ మంటల్లో కాలిపోతూ ఉండగా.. చుట్టూ ఉన్నవారు నిప్పుని ఆర్పి.. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆ మహిళ శరీరం 40 శాతం కాలిపోగా.. నరేంద్ర 25 శాతం కాలిపోయాడు. ప్రస్తుతం వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు.. నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు చేసుకొని.. విచారణ చేస్తున్నారు.

Advertisement

Also Read: భార్య సహా 42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్ చూస్తుండగా అరెస్ట్!

 

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×