BigTV English

KCR Divert politics: బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్, కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఆసక్తి వ్యాఖ్యలు..

KCR Divert politics: బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్, కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఆసక్తి వ్యాఖ్యలు..

KCR Divert politics(Political news in Telangana): తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ డైవర్ట్ రాజకీయాలు మొదలుపెట్టింది. దీంతో అధికార కాంగ్రెస్‌- విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ గేమ్‌లో చిత్తైందెవరు? రాజకీయ పార్టీలా..? లేక నేతలా?


మంగళవారం రేవంత్‌రెడ్డి సర్కార్ రైతుల రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల చేసింది. దాదాపు ఆరున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. మొత్తం రెండు విడతల్లో కలిసి దాదాపు 18 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరింది. తెలంగాణలో రైతులకు ఇది పెద్ద పండుగన్నమాట. దీంతో అధికార ప్రభుత్వం ఫుల్ హ్యాపీ. ఇంతవరకు బాగానే ఉంది. రుణమాఫీ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ కొత్త పాచిక వేసింది.

రేవంత్ సర్కార్ నిధులు విడుదల చేసిన అరగంటకే తన మార్క్ రాజకీయాలను మొదలుపెట్టేసింది బీఆర్ఎస్. గతంలో కారు దిగిన కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అసెంబ్లీలోని తన ఛాంబర్‌కు రప్పించు కుంది బీఆర్ఎస్. నార్మల్‌గా అధికార-విపక్ష ఎమ్మెల్యేలు కలిస్తే రాజకీయాల గురించి చర్చించుకోవడం సహజం. అక్కడే అదే జరిగింది. ఈ క్రమంలో ఆయా నేతలతో దిగిన ఫోటోలను బీఆర్ఎస్ నేతలు బయట కు వదిలారు. తమ పార్టీ నుంచి వెళ్లిన నేతలకు మళ్లీ పాత గూటికి వచ్చేస్తున్నారంటూ ఓ వార్తను సోషల్‌ మీడియా వేదికగా షేర్ చేసింది.


తెలంగాణ ప్రజల అటెన్షన్ రాజకీయాల వైపు మళ్లింది. రుణమాఫీ అంశం డైవర్ట్ అయ్యింది. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఛాంబర్‌కు వెళ్లినదానిపై మంత్రులు ఆరా తీశారు. దీంతో బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో కారు పార్టీ బాగానే సక్సెస్ అయ్యింది. సాయంత్రానికి అసలు గుట్టు బయటపడింది. బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్ తెరతీసిందన్న విషయం ఆలస్యంగా పసిగట్టారు కాంగ్రెస్ నేతలు.

ALSO READ: రేప్ చేసి విదేశాలకు పారిపోయే ప్రయత్నం.. రంగంలోకి దూకిన పోలీసులు

ఈ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర చాలా కీలక మైందని, కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడే నేతలు ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారన్నారు. అసలు సీఎం రేవంత్‌రెడ్డికి- కేసీఆర్‌కు పోలిక లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు కలిసి ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఓడించడానికి నానాప్రయత్నాలు చేశారని, చివరకు బోల్తాపడ్డారని గుర్తుచేశారు. మంగళవారం రోజు రాజకీయాలు ఆ విధంగా ముగిశాయి. రుణమాఫీ విషయాన్ని డైవర్ట్ చేద్దామని భావించిన కారు పార్టీ, చివరకు ప్రజల ముందు చులకనైపోయింది.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×