BigTV English

Mr. Bachchan trimmed: మిస్టర్ బచ్చన్ కు రిపేర్లు చేస్తున్న నిర్మాతలు

Mr. Bachchan trimmed: మిస్టర్ బచ్చన్ కు రిపేర్లు చేస్తున్న నిర్మాతలు

Mr. Bachchan producers taking decession to trimmed 13 minutes: ఎనర్జిటిక్ స్టార్ మాస్ మహరాజా సినిమాలు అనగానే ఓ రేంజ్ కామెడీ, ఎంటర్ టైన్మెంట్,మాస్ ఎలివెంట్లు, గూస్ బంప్స్ సీన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు ఆడియన్స్. ఆయన సినిమాలో కాస్త విషయమున్నా..యావరేజ్ టాక్ తెచ్చుకున్నా గతంలో సాలిడ్ కలెక్షన్లు తెచ్చుకున్నాయి రవితేజ సినిమాలు. స్టార్ డమ్ తో పనిలేదు..రవితేజ అంటే మినిమం గ్యారెంటీ..అదంతా ఒకప్పుడు..ప్రస్తుతం పరిస్థితులు రివర్స్ అవుతున్నాయి. రవితేజ నేల విడిచి కర్రసాము చేస్తున్టుట్లు తోస్తోంది. ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ అవికాస్తా వికటించేసరికి రవితేజ దెబ్బతింటున్నాడు. అయితే ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న హరీశ్ శంకర్ తో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకున్నాడు.


హరీశ్ తో హ్యాట్రిక్ కొట్టాలని..

షాక్, మిరపకాయ్ చిత్రాల విజయంతో హరీశ్ శంకర్ పై పూర్తి నమ్మకం ఉంచాడు. అయితే దబాంగ్ లాంటి సినిమాను పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోను పెట్టి..కొన్ని కామెడీ సీన్లు పెట్టి..సన్నివేశాలలో కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి గబ్బర్ సింగ్ ను బ్లాక్ బస్టర్ చేశాడు హరీశ్ శంకర్. ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టే రవితేజ హరీశ్ తనకు హ్యాట్రిక్ సక్సెస్ ఇస్తాడని రెండో ఆలోచన లేకుండా మిస్టర్ బచ్చన్ చేశాడు. మొన్న శుక్రవారం రిలీజయిన మిస్టర్ బచ్చన్ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఈ సినిమాను చెడుగుడు ఆరేసుకుంటున్నారు. హరీశ్ నవ్విద్దామని చేసిన ప్రయత్నం కాస్తా నవ్వులపాలయింది. ముఖ్యంగా సన్నివేశాలన్నీ ల్యాగింగ్ కావడంతో ప్రేక్షకులు అసహనానికి గురవుతున్నారు. అనవసర సన్నివేశాలు జోడించి సినిమా కంటిన్యుటీ దెబ్బతీశారని హీరో రవితేజ అభిమానులు హరీశ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన ఏ సినిమా కూడా ఇలాంటి దారుణమైన ట్రోలింగులను ఎదుర్కోలేదు. నెగెటివ్ రివ్యూల ఫలితంగా కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగా వస్తున్నాయి. వచ్చిన నెగెటివ్ టాక్ ను బట్టి సోమవారం నుండి కలెక్షన్లు మరింత పడిపోతాయని సినీ వర్గాలు అంటున్నాయి. వరుస సెలవలు కూడా ఈ మూవీని కాపాడలేకపోతున్నాయి.


13 నిమిషాలు కత్తెర

మిస్టర్ బచ్చన్ దర్శకుడు, నిర్మాతలు కలిసి ఈ సినిమాపై ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ ను పిలిపించుుని సినిమలో వచ్చే ల్యాగింగ్ సన్నివేశాలను కత్తిరించే పనిలో ఉన్నారట. దాని వలన సినిమా కంటిన్యుటీ కి ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతుందని..ఇలాంటి మార్పులతో కలెక్షన్లు పుంజుకోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. ఓవరలాల్ గా బచ్చన్ సినిమాకు 13 నిమిషాల లెంగ్త్ తగ్గిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా బచ్చన్ నిర్మాతలు తెలిపారు. అయితే దీని ప్రభావంతోనైనా కలెక్షన్లు పెరగవచ్చని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×