BigTV English
Advertisement

Gang rape in Eluru District: ఏపీలో దారుణం.. భర్తపై దాడి చేసి భార్యపై సామూహిక అత్యాచారం!

Gang rape in Eluru District: ఏపీలో దారుణం.. భర్తపై దాడి చేసి భార్యపై సామూహిక అత్యాచారం!

Gang rape in Eluru District: ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. కలకత్తా ట్రైనీ వైద్యురాలి ఘటన మరువక ముందే మరో మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ మహిళ భర్తతో కలిసి మద్యం తాగిన ముగ్గురు యువకులు..భర్తను చితక్కొట్టి, అతని భార్యను కొంతదూరం ఈడ్చుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు.


భర్తతో కలిసి రాత్రి మద్యం తాగిన ముగ్గురు యువకులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే భార్యభర్తలు నిద్రిస్తున్న సమయంలో ఆ ముగ్గురు యువకులు భార్యను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె కేకలు వేయడంతో భర్తకు లేచి అడ్డుకునేందుక ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఆయన కాళ్లపై విచక్షణా రహితంగా కొట్టి..వివాహితను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయికి చెందిన ఇద్దరు దంపతులు ఇటీవల ఏలూరు పట్టణానికి వచ్చారు. వన్ టౌన్ రామకోటి ప్రాంతంలో ఉంటూ ఉదయం హోటల్‌లో పనిచేస్తున్నారు. రాత్రి రామకోటిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్టేజీ అరుగులపై నిద్రిస్తున్నారు. అయితే జీతం వచ్చిన తర్వాత అద్దె ఇళ్లుకు మారాలని అనుకున్న వీళ్లకు ఓ ముగ్గురు యువకులు పరిచయమయ్యారు. వారం రోజులుగా అక్కడే ఉంటున్న వీరితో నగరానికి చెందిన ముగ్గురు యువకులు స్నేహంగా ఉంటున్నారు.


శుక్రవారం రాత్రి ముగ్గురు యువకులు, విజయరాయికి చెందిన వ్యక్తికి మద్యం తాగించారు. అతను మద్యం మత్తులో నిద్రపోయిన వెంటనే ఆ పక్కనే నిద్రిస్తున్న అతడి భార్య(35)ను అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె వద్దని చెప్పినప్పటికీ ఆ ముగ్గురు బలవంతం చేశారు. దీంతో ఆమె కేకలు వేసింది. భర్తకు మెలకువ వచ్చి అడ్డగించేందుకు ప్రయత్నించగా.. ఆ యువకులు ఓ కర్రతో కాళ్లపై బలంగా కొట్టడంతో నడవలేని పరిస్థితి నెలకొంది. అనంతరం ఆ మహిళను సమీపంలోని భవనంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ సమయంలో ఆమె ప్రతిఘటించడంతో ఆమె ముఖంపై దాడి చేశారు.

బాధితురాలి భర్త పాకుకుంటూ రోడ్డుపైకి వచ్చి కేకలు వేశాడు. ఈ సమయంలో సెకెండ్ షో సినిమా చేసి వస్తున్న ఓ యువకుడు వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని పోలీసులు పట్టించుకోలేదని ఆ యువకుడు చెబుతున్నాడు. అయితే భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Also Read: ‘మా ఆవిడ నన్ను కొడుతోంది.. నేను జైల్లో ఉంటా?’.. ఇంటి నుంచి పారిపోయిన భర్త!

నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఏలూరులోని లంబాడీ పేటకు చెందిన నారపాటి నాగేంద్ర, చెంచుల కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, మరడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డి విజయ్ కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిని కోర్టు లో హాజరుపర్చగా.. 14 రోజులపాటు రిమాండ్ విధించింది.

 

Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×