E-Paper
Advertisement

MrBachchan Showreel: మాస్ మహారాజాకు డైలాగ్ కూడా అవసరం లేదు.. పవర్ అలాంటింది

MrBachchan Showreel: మాస్ మహారాజాకు డైలాగ్ కూడా అవసరం లేదు.. పవర్ అలాంటింది
Advertisement

MrBachchan Showreel: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మిస్టర్ బచ్చన్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బొర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మొదటి నుంచి కూడా హరీష్ – రవితేజ కాంబో అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీరి కాంబోలో ఇప్పటికే మిరపకాయ్ లాంటి సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే హరీష్ మాస్ ఎలివేషన్స్ పడాల్సిందే. ఇక ఇందులో రవితేజ.. అమితాబ్ బచ్చన్ కు పెద్ద ఫ్యాన్ గా కనిపించబోతున్నాడు.

Advertisement

రియల్ గా కూడా మాస్ మహారాజా రవితేజ.. అమితాబ్ బచ్చన్ కు పెద్ద ఫ్యాన్ అన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి షో రీల్ ను రిలీజ్ చేశారు. డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్ సీన్స్ తో ఈ షో రీల్ ను కట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.ముఖ్యంగా రవితేజ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది.

ఊర మాస్ ఎలివేషన్స్ తో రవితేజ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని షో రీల్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక రవితేజకు ధీటుగా జగపతిబాబు విలనిజం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ షో రీల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Advertisement

చివర్లో అమితాబ్ బచ్చన్.. కటౌట్ ముందు రవితేజ నిలబడి ఉండే షాట్ చూసాక.. మాస్ మహారాజాకు డైలాగ్ కూడా అవసరం లేదు.. పవర్ అలాంటింది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×