BigTV English

Hi Nanna Movie : నాని మృణాల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ.. “ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి” అంటున్న ఆడియన్స్..

Hi Nanna Movie : నాని మృణాల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ.. “ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి” అంటున్న ఆడియన్స్..

Hi Nanna Movie : నేచురల్ స్టార్ నాని, బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ కాంబో లో వస్తున్న హై రొమాంటిక్ సెంటిమెంటల్ మూవీ  ‘హాయ్ నాన్న’ . ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ పై మూవీ టీమ్ జోరు పెంచింది. మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ చిత్రంలో ఎమోషన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పకనే చెప్పింది. ఈ చిత్రం హీరో హీరోయిన్ లవ్ జర్నీ ను ఎలివేట్ చేయడంతో పాటు తండ్రి కూతుర్ల మధ్య ఉన్న సెంటిమెంట్ ని ఎంతో అందంగా హై లైట్ చేస్తుంది.


ఈ మూవీ టీజర్ డాటర్ సెంటిమెట్ తో పాటు హీరో హీరోయిన్ లవ్ జర్నీ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన మూడో సింగిల్ గురించి తాజాగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి సమయమా ,గాజు బొమ్మ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు సాంగ్స్ శ్రోతలను బాగా అలరించాయి.

ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి విడుదల కాబోతున్న మూడో సింగిల్ అమ్మాడి పేరుతో ఈనెల 4వ తారీఖున ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ని కూడా మూవీ టీం విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోమోలో ‘ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి’ అంటూ సాగే ఈ పాట లో మృణాల్ నాని మధ్య జరిగే రొమాంటిక్ సీన్ ఎంతో టచింగ్ గా ఉంది.


ఇందులో మృణాల్ మొదట బాధగా నాని ని టచ్ చేస్తుంది.. కానీ నాని నవ్వు చూసి మెల్లిగా అతని ఛాతీ పై గిచ్చుతుంది. ఆ తర్వాత ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఇది కేవలం ఒక సీన్ మాత్రమే కాదు ఇద్దరు లవర్స్ మధ్య సాగే చిన్ని రొమాంటిక్ ఎమోషన్. ఈ ఒక్క చిన్న క్లిప్ తో ఆన్ స్క్రీన్ ఈ జోడీ మధ్య కెమిస్ట్రీ నెక్ట్స్ లెవెల్లో ఉండబోతుందని అర్దం అవుతుంది. అలాగే సాంగ్ కూడా ఊహించిన దానికంటే రొమాంటిక్ గా ఉంటుంది అని అనిపిస్తోంది.

ఈ మూవీకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ సమయమా లో నాని – మృణాల్ ఠాకూర్ మధ్య లవ్, అటాచ్మెంట్ చూపిస్తే..సెకండ్ సాంగ్ గాజు బొమ్మ లో తండ్రి, కూతురు మధ్య అనుబంధాన్ని చూపించారు. ఇప్పుడు ఈ థర్డ్ సాంగ్ ప్రేమికుల మనసుకు హత్తుకునేలా చూపించేలా ఉన్నారు. ముందు వచ్చిన రెండు పాటల లాగానే ఈ పాట కూడా ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అని అనిపిస్తోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగు ,హిందీ ,తమిళ్ ,కన్నడ ,మలయాళం భాషలో గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×