BigTV English

Spiritual Rules : దీపం వెలిగించేటప్పుడు ఆ పని అస్సలు చేయద్దు

Spiritual Rules : దీపం వెలిగించేటప్పుడు ఆ పని అస్సలు చేయద్దు

Spiritual Rules : హిందూ సంప్రదాయంలో ఎన్నో నియమాలు , నిబంధనలు ఉన్నాయి. ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేసిన సర్వశుభములు, శాంతి కలుగును.దీపాన్ని వెలిగించేందుకు, ఆర్పేందుకు కొన్ని పద్ధతులు ఉంటాయి.


దీపాన్ని కొండెక్కించే ముందు…..

ఇంట్లోని పూజామందిరంలో లక్ష్మీదేవి, దుర్గాదేవిలా శక్తులు ఉంటాయి. దీపకాంతి ఇంట్లోని దుష్టశక్తులను తరిమికొడుతుంది. దీపారాధనకు ఉపయోగించే దీపపు కుందిలో త్రిమూర్తులు నివాసం ఉంటారు. అందుకే దీపారధన కుందిలో నూనె లేదా నెయ్యి పోసి ఉన్నంతవరకు దీపాన్ని వెలిగించాయి. వత్తులు పూర్తిగా మండుకోక ముందే దీపాన్ని కొండెక్కించాలి.


దీపాన్ని వెలిగించినప్పటి నుంచి కొండెక్కించేంత వరకు నూనె ఆ దీపంలో ఉండేలా చూసుకోవాలి. దీపంలో మహాలక్ష్మి, దీప కాంతిలో సరస్వతి దీపంలో వెచ్చదనంలో పార్వతిదేవి ఉంటారు. అందుకే దీపాన్ని త్రిమూర్తులను, ముగ్గురమ్మలను కొలచిన వారవుతాము.

అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తే దోషం

నేతితో దీపాన్ని వెలిగించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి. అగ్గిపుల్లతో నేరుగా కుందుల్లో దీపాన్ని వెలిగించకూడదు . మరొక దీపం ద్వారా ఏక హారతి ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి. దీపారాధన కుదిలో ఐదు వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాయి. ఐదు వత్తుల్లో మొదటిది భర్తు, సంతానం సంక్షేమం కోసం అన్నమాట.రెండోది అత్తమామల సంక్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల సంక్షేమానికి నాలుగోది వృద్ధులకు , ఐదోది వంశాభివృద్ధికి అని పండితులు చెబుతుంటారు. దీపారాధన ఎవరూ చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా ఉండాలి. ఏక వత్తితో పూజామందిరంలో దీపాన్ని వెలిగించరాదు.

ఇంటి ముందు తులసి మొక్క ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే.. ఇంట్లోకి దుష్ట శక్తులు రావు. ముఖ్యంగా వెండి ప్రమిదల్లో నేతితో గానీ, నువ్వుల నూనెతో కానీ, పొద్దు తిరుగుడు నూనెతో కానీ దీపారాధన చేస్తే వారికి అష్ట నిధులు చేకూరుతాయని విశ్వాసం. దీపారాధన చేస్తే మేధస్సు పెరిగి సాత్విక మార్గంలో సంపాదన చేకూరుతుంది.

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×