BigTV English

Varun Tej – Lavanya Wedding : బాబాయే నాకు వెలకట్టలేని గిఫ్ట్ అంటున్న అబ్బాయి.. మెగా ఫ్యామిలీ ఎమోషనల్ మూమెంట్స్..

Varun Tej – Lavanya Wedding : బాబాయే నాకు వెలకట్టలేని గిఫ్ట్ అంటున్న అబ్బాయి.. మెగా ఫ్యామిలీ ఎమోషనల్ మూమెంట్స్..

Varun Tej – Lavanya Wedding : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ సుదీర్ఘమైన ప్రేమ కథ ను ఈ రోజు వివాహ బంధంతో కొత్త శ్రీకారం చుట్టారు. తమ ప్రేమకు పునాది వేసిన ఇటలీని వేదికగా చేసుకొని వీరిద్దరి వివాహం జరిగింది. ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఇటలీలో సందడి చేశారు. హ్యాపీగా దిగిన ఫ్యామిలీ ఫొటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే అబ్బాయి పెళ్లి కోసం బాబాయి భారీ గిఫ్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


అన్న కొడుకు పెళ్ళికి రెండు రోజుల ముందే ఇటలీకి సతీసమేతంగా వెళ్లిన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కోసం తన అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. ఒకపక్క సినిమాలు మరో పక్క రాజకీయంతో బిజీ గా ఉన్నా అన్న కొడుకు కోసం సమయాన్ని కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. ఒకపక్క పూర్తి చేయవలసిన సినిమాలు, మరోపక్క తరుముకొస్తున్న ఎన్నికలు.. ఇన్నిటి మధ్య కూడా పవన్ ,వరుణ్ తేజ్ కోసం ఇటలీ కి వెళ్లారు.

వీరి వివాహం ఇటలీలోని బోర్గో సాన్ ఫెలీస్‌లో ఘనంగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు సుమారు 120 మంది అతిధులను ఎంపిక చేశారు. కొణిదల ఫ్యామిలీ ,కామినేని ఫ్యామిలీ ,అల్లు ఫ్యామిలీతో పాటు లావణ్య కుటుంబ సభ్యులు ఈ వివాహ వేడుకలలో పాల్గొనడానికి రెండు రోజుల ముందే ఇటలీకి చేరుకున్నారు. రాయల్ టచ్ అప్ తో జరిగే ఈ వెడ్డింగ్ కి హాజరయ్యే అతిధుల కోసం ఏర్పాట్లు కూడా ఎంతో రాయల్ గా చేయడం జరిగింది.


అయితే సరిగ్గా వరుణ్ పెళ్లి సమయంలోనే ఏపీ రాజకీయ పరిస్థితులు కాస్త గందరగోళంగా మారాయి. ఈ నేపథ్యంలో పవన్ వరుణ్ పెళ్లికి వెళ్తారా లేదా? అన్న అనుమానం తలెత్తింది. అయినా తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన కొడుకు కోసం పవన్ అన్ని కార్యక్రమాలను పక్కనపెట్టి ,షూటింగ్ రద్దు చేసుకొని ఇటలీకి పయనమయ్యాడు. పవన్ రాక మెగా ఫ్యామిలీలో కొత్త సందడి తీసుకువచ్చింది.

అన్న కొడుకు పెళ్లికి పవన్ భారీ గిఫ్ట్ ఏర్పాటు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్. అయితే వరుణ్ మాత్రం బాబాయ్ మీరు మా పెళ్ళికి రావడమే నాకు పెద్ద గిఫ్ట్ అంతకుమించి వేరొక గిఫ్ట్ వద్దు అని అన్నట్లు తెలిసింది. ఇలా ఈ పెళ్లి సందర్భంగా మెగా ఫ్యామిలీలో ఓ మంచి ఎమోషన్ సీన్ చోటు చేసుకుంది. అయితే ఇంతకీ బాబాయి అబ్బాయి కోసం ఏర్పాటు చేసిన గిఫ్ట్ ఏమిటో త్వరలో వెల్లడి అవుతుంది ఏమో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×