BigTV English

Spirit Heroine : దీపిక అవుట్… మరో హీరోయిన్ ఇన్… డార్లింగ్‌కు ఈమె పర్పెక్ట్ మ్యాచ్..

Spirit Heroine : దీపిక అవుట్… మరో హీరోయిన్ ఇన్… డార్లింగ్‌కు ఈమె పర్పెక్ట్ మ్యాచ్..

Spirit Heroine : టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. కల్కి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ మూవీ చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి రాబోతుంది. ఆ తర్వాత ఫౌజీ సినిమాని పూర్తి చేసి సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీలో నటించబోతున్నాడు ప్రభాస్. ఈ మూవీలో ప్రభాస్ కి జోడిగా హీరోయిన్ ఫిక్స్ చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


స్పిరిట్ లో ప్రభాస్ కు జోడిగా మృణాల్ ఠాకూర్..? 

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఎంతో మంది హీరోయిన్లు అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. స్పిరిట్ లో స్టార్ హీరోయిన్ ను దింపాలని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా భావిస్తున్నారట. అయితే, నిన్నటి వరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ప్రభాస్ తో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆమె కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల డైరెక్టర్ ఆమెను పక్కనపెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారట.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దీపికా ప్లేస్ ను భర్తీ చేసేందుకు మృణాల్ ఠాకూర్ అయితే బాగుంటుందని ప్రభాస్ పక్కన పర్ఫెక్ట్ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. సందీప్ రెడ్డి అనుకున్నట్టు మృణాల్ తెలుగులో కూడా డబ్ చెప్పగలదు. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకు కరెక్ట్ గా పనిచేస్తుందని ఈమె అయితేనే సినిమా త్వరగా పూర్తి చేయగలుగుతారని డైరెక్టర్ ని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అతి త్వరలోనే హీరోయిన్ ఫిక్స్ చేసి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని వంగ ఆలోచనలో ఉన్నట్లు ఫిలిం నగర్ లో టాక్..


పాన్ ఇండియా సినిమాలతో డార్లింగ్ ఫుల్ బిజీ.. 

హీరో ప్రభాస్ చేతిలో ఎప్పుడూ అరడజనుకు పైగా సినిమాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఏడాదికి ఒక్క సినిమాతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఏడాదికి రెండు సినిమాలు ఉంటే బాగుండు అని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈయన ఈ సంవత్సరం రాజా సాబ్ తో పలకరించనున్నారు. ఆ తరువాత వరుసగా కల్కి2, సలార్ 2, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉనాయి. ఈ సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇటీవల వెకేషన్ కి వెళ్ళిన ప్రభాస్ నిన్ననే ఇండియాకు తిరిగి వచ్చేసాడు. ఇక హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకేక్కుతున్న ఫౌజీ షూటింగ్ కు తిరిగి హాజరుకానున్నారు. ఈ సినిమాని అతి త్వరగా పూర్తిచేసి స్పిరిట్ సినిమాని పట్టాలెక్కించే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారని తెలుస్తుంది. ఆ తర్వాత సీక్వెల్ సినిమాలపై దృష్టి పెట్టనున్నాడు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×