BigTV English

Hair Wash: ఖరీదైన షాంపూలు అవసరమే లేదు.. వీటితో బెస్ట్ రిజల్ట్స్

Hair Wash: ఖరీదైన షాంపూలు అవసరమే లేదు.. వీటితో బెస్ట్ రిజల్ట్స్

Hair Wash: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నిర్జీవమైన, రాలిపోతున్న జుట్టుతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు సమస్యలు చాలా మందిలో పెరుగుతూనే ఉన్నాయి. వీటిని వదిలించుకోవడానికి తరచుగా ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ వాడే వారు చాలా మందే ఉంటారు. ఈ రోజుల్లో జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయని చెప్పుకునే అనేక రకాల షాంపూలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నిజం ఏంటంటే.. వాటిలో ఉండే రసాయనాలు జుట్టుకు మేలు చేయడానికి బదులుగా జుట్టును దెబ్బతీస్తాయి.


మీరు కూడా ఇలాగే ఖరీదైన షాంపూలను వాడి విసిగిపోయి, మీ జుట్టును సహజ పద్ధతిలో జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే.. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు మీకు చాలా ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించిన తర్వాత మీ జుట్టు శుభ్రంగా, ఆరోగ్యంగా, మెరుసూ కనిపిస్తుంది. అంతే కాకుండా మీ జుట్టును పూర్తిగా శుభ్రం చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.

షికాకై:
షికాకై యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి, జుట్టును తేమగా మార్చడానికి పనిచేస్తాయి. ఇది జుట్టుకు మూలాల నుండి పోషణను అందిస్తుంది. అంతే కాకుండా డ్యామేజ్ కాకుండా నిరోధిస్తుంది.


షీకాకైను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం, తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలు ఆగిపోతాయి. మీరు షీకాకై కొని ఇంట్లోనే రుబ్బుకోవచ్చు. ఈ రోజుల్లో.. షీకాకై పొడి కూడా సులభంగా మార్కెట్‌లో దొరుకుతుంది. ఒకటి లేదా రెండు చెంచాల షీకాకై పొడిని తీసుకుని.. దానికి కొంచెం నీరు కలిపి మందపాటి పేస్ట్ లా చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి బాగా కడగాలి.

కుంకుడు కాయ:
షీకాకై లాగే కుంకుడు కాయ కూడా ఒక మొక్క తీసిన ఉత్పత్తి. ఇది నీటిలో నానబెట్టాల్సిన విత్తనం. కుంకుడు కాయ పొడి కూడా మార్కెట్లో లభిస్తుంది. చుండ్రు నివారణకు కుంకుడు కాయ మంచిది. జుట్టు పొడవును బట్టి మీరు ఒకటి లేదా రెండు చెంచాల కుంకుడు కాయ పొడిని తీసుకొని కొంచెం నీటితో కలిపి ఉపయోగించవచ్చు.

ఈ మిశ్రమాన్ని జుట్టు వాష్ చేయడానికి ఉపయోగించవచ్చు. దీనిని జుట్టుకు సమానంగా అప్లై చేసి.. సున్నితంగా మసాజ్ చేయండి. దాదాపు 3-4 నిమిషాలు అలాగే ఉంచి.. తర్వాత జుట్టును కడిగేయండి.

Also Read: పెరుగు ఇలా వాడితే.. జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది తెలుసా ?

ముల్తానీ మిట్టి:
ముల్తానీ మట్టిని సహజ ఔషధ గుణాలు కలిగిన మట్టిగా పిలుస్తారు. ఇది పురాతన కాలం నుండి జుట్టు వాష్ చేయడానికి అంతే కాకుండా ముఖ కాంతిని పెంచడానికి ఉపయోగించబడుతోంది.

దీనిని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు కొత్త మెరుపు వస్తుంది. అంతే కాకుండా తలపై ఉన్న జిడ్డు కూడా తొలగిపోతుంది. 1 లేదా 2 చెంచాల ముల్తానీ మిట్టి.. 1 చెంచా తేనె , 1/4 కప్పు పెరుగు కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. దీనిని తలకు పట్టించి దాదాపు 15 నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం తలకు మసాజ్ చేసి.. ఆపై నీటితో బాగా కడిగేయండి.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×