Elephants Fed 400 Pills | పెద్ద శరీరాకారం ఉన్నా.. ఏనుగు అంటే అందరికీ ఒక రకమైన ఇష్టం. ఇతర అడవి మృగాలకంటే ఏనుగును చూస్తే ఫ్రెండ్లీ జంతువుగా కనిపిస్తుంది. అందుకే దీన్ని కొంత మంది పెంచుకుంటూ ఉంటారు. బలానికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలాంటి ఏనుగులు కూడా బలహీనమైపోతున్నాయి. వారికి కూడా మనిషి లాగే క్షయ వ్యాధి సోకింది. క్షయ వ్యాధి సోకితే శరీరం రోజు రోజుకీ బలహీనమైపోతుంది. అలా రెండు ఏనుగులుకు క్షయ వ్యాధి సోకిందని తెలిసి వైద్యులు ఆ ఏనుగులకు వింత చికిత్స చేస్తున్నారు. ఆ బలహీన ఏనుగులు పాకిస్తాన్ లో ఉన్నాయి.
పాకిస్తాన్ లో పశు వైద్యులు(వెటర్నరీ డాక్టర్లు) .. క్షయ వ్యాధి (ట్యూబర్‌కులోసిస్)తో బాధపుడుతున్న రెండు ఏనుగులకు అరుదైన చికిత్స ప్రారంభించారు. ఆ ఏనుగులు పాకిస్తాన్ లోని కరాచి సఫారీ పార్క్ లో ఉన్నాయి. వాటికి చికిత్స్ చేసేందుకు వైద్యులు అదే ఓ కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు – రోజూ 400 మందులు తినిపించడం! అయితే ఈ ఏనుగులకు ఔషధ రూపంలో రోజుకు 400 టాబ్లెట్స్ ఇస్తున్నారట. మనుషులు కూడా క్షయ వ్యాధి సోకితే.. రోజూ టాబ్లెట్స్ తినాల్సిందే. మనుషులు తినే క్షయ వ్యాధి చికిత్స టాబ్లెట్స్ నే ఏనుగులకు ఇస్తున్నారు.
అయితే ఏనుగుల బరువును బట్టి డోస్ ను పెంచారు. ఆ ఏనుగులు ఒక్కొకటి సుమారు 4000 కేజీలు ఉండడంతో అందుకు తగ్గట్టు టాబ్లెట్లు కూడా భారీ సంఖ్యలో ఇవ్వాల్సి వస్తోంది. మందులు చేదుగా ఉండటంతో చికిత్స ప్రారంభంలో ఈ రెండు ఏనుగులు వాటిని తినడానికి నిరాకరించాయి. బలవంతం చేస్తే అక్కడి సేవకులపై కూడా కోపంగా దూకాయి. దీనికి పరిష్కారంగా వైద్యులు ఆహారంలో కలిపి ఆ టాబ్లెట్స్ ను తినిపిస్తున్నారు. యాపిల్స్, అరటిపండ్లు, తీపి వంటకాలలో ఆ టాబ్లెట్స్ కలిపి ఏనుగులకు ఇస్తున్నారు. దీంతో ఆ ఏనుగులు తినగలుగుతున్నాయి.
ఆహారంలోనే మందులు…
శ్రీలంక నుండి వచ్చిన వెటర్నరీ డాక్టర్ బుద్ధిక బండార ఈ చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. “ఏనుగులకు టీబీ మందులు ఇవ్వడం చాలా కష్టమైన పని. ప్రతి రోజు కొత్త మార్గాలే ప్రయత్నించాల్సి వస్తోంది,” అని ఆయన అన్నారు.
ప్రత్యేకంగా శుభ్రంగా ఉన్న మాహౌట్ (ఏనుగులకు సేవ చేసే వారు) అలీ బాలోచ్.. ప్రతీ ఉదయాన్నే లేచి బియ్యం, పప్పు, చెరకు రసం, టాబ్లెట్స్ అన్ని కలిపి మిశ్రమంగా తయ్యారు చేస్తాడు. అందులోనే టాబ్లెట్లు పెట్టి ఏనుగులకు తినిపిస్తారు. “మందు చేదుగా ఉంటుంది కాబట్టి ఇలా తినిపించాల్సి వస్తోంది,” అని 22 ఏళ్ల అలీ బలోచ్ చెప్పాడు. మందుల రుచి ఏనుగులకు తెలియకుండా పండ్లు, బంగాళదుంపలు, పాకిస్తానీ స్వీట్లు కూడా వాడుతున్నారు.
మానవుల నుంచి జంతువులకు వ్యాధి?
నిజానికి నాలుగు ఆఫ్రికన్ ఏనుగులను 2009లో టాంజానియాలోని అడవుల నుంచి చిన్న వయస్సులో పాకిస్తాన్‌కు తీసుకువచ్చారు. అందులో నూర్ జహాన్ అనే ఏనుగు 2023లో మరణించింది. సోనియా అనే మరొకటి 2024 చివరలో చనిపోయింది. సోనియాకు టీబీ వచ్చినట్టు పోస్టుమార్టంలో తేలింది. అందువల్ల ప్రస్తుతం ఉన్న మద్దుబాల, మలికను కూడా పరీక్షించగా వాళ్లకూ టీబీ ఉన్నట్టు తేలింది. అయితే వారికి ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా, చికిత్స మొదలుపెట్టారు.
ఇండస్ హాస్పిటల్‌కు చెందిన సంక్రమణ వ్యాధుల నిపుణురాలు నసీమ్ సలాహుద్దీన్ ఈ ప్రక్రియను సమీక్షిస్తున్నారు. “ఏనుగులకు కూడా టీబీ వస్తుందనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది,” అని ఆమె అన్నారు. హాస్పిటర్ వైద్య విద్యార్థులు కూడా ఈ కేసుపై ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: సిగరెట్ లైటర్ సైజులో మొబైల్.. క్రిమినల్స్ కోసం స్పెషల్!
సుదీర్ఘంగా కొనసాగుతున్న వైద్యం
ఈ రెండు ఏనుగులకు ఏడాది నుంచి చికిత్స కొనసాగుతోంది. సేవకులు ప్రత్యేకమైన దుస్తులు, మాస్కులు ధరించి ఏనుగులకు దగ్గరగా ఉంటారు, ఎందుకంటే టీబీ చాలా వేగంగా మనుషులకు సంక్రమించే వ్యాధి.
కరాచీ సఫారి పార్క్ నిర్వహకులపై గతంలో జంతువుల పట్ల అనుచితంగా వ్యవహరించినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అమెరికన్ గాయని చేర్ ఆధ్వర్యంలో ఓ ఏనుగును రక్షించారు. కానీ ఇప్పుడు ఈ రెండు చివరి ఏనుగులను రక్షించేందుకు వారు చాలా శ్రమపడుతున్నారు. ఇప్పుడు మాత్రం – మద్దుబాల, మలిక ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ – ఈ వైద్య బృందం అపారమైన ప్రేమతో సేవ చేస్తోంది.