E-Paper
Advertisement

Mufasa The Lion King Trailer: సింహానికి మహేశ్ బాబు వాయిస్.. ‘ముఫాసా ది లయన్‌ కింగ్’ ట్రైల‌ర్ చూస్తే గూస్‌బంప్సే

Mufasa The Lion King Trailer: సింహానికి మహేశ్ బాబు వాయిస్.. ‘ముఫాసా ది లయన్‌ కింగ్’ ట్రైల‌ర్ చూస్తే గూస్‌బంప్సే
Advertisement

Mufasa The Lion King Trailer: లయన్ కింగ్ సినిమాకు భారతదేశంలో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే వచ్చిన ది లయన్ కింగ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు సైతం ఈ సినిమా కొల్లగొట్టింది. 2019లో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌ వస్తుంది. అదే ‘ముఫాసా: ది లయన్ కింగ్’. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు బాగా హైలైట్ అయ్యాయి.

ఇటీవలే ఈ సినిమా నుంచి ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ కాగా సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే హిందీ వెర్షన్ ట్రైలర్ కూడా రిలీజ్ అయి అందరినీ అలరించింది. అయితే హిందీలో ఈ మూవీ ట్రైలర్‌కు బాలీవుడ్ బాద్షా షారుఖ్ తన వాయిస్ ఓవర్ అందించాడు. ‘ముఫాసా: ది లయన్ కింగ్’లోని ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. అంతేకాకుండా మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఇందులోని యంగ్ ముఫాసాకు షారుఖ్ ఖాన్ చిన్న కుమారుడు అబ్‌రామ్ వాయిస్ అందించాడు. అదే సమయంలో సింబా పాత్రకు అతడి పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఈ సినిమాలోని పాత్రలకు డబ్బింగ్ చెప్పడం విశేషం అనే చెప్పాలి.

Advertisement

Also Read: ముఫాసా ట్రైలర్ మామూలుగా లేదుగా, గూస్‌బంప్స్‌ అంతే..!

ఇక తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పాడు. తెలుగు వెర్షన్‌లో ముఫాసా పాత్రకు అతడు తన గాత్రం అందించాడు. అయితే అదే సమయంలో బ్రహ్మానందం ‘పుంబా’ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. అలాగే టిమోన్ పాత్ర కోసం అలీ తన వాయిస్‌ను అందించాడు. దీంతో తెలుగు ట్రైలర్‌కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా మహేశ్ బాబు వాయిస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

Advertisement

ఈ ట్రైలర్‌లో అతడి డైలాగ్స్ ఓ రేంజ్‌లో సినీ ప్రియుల్ని అలరిస్తున్నాయి. ‘‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్లు అనిపిస్తుంది. అంతలోనే మాయం అవుతుంది’’ అని చెప్పే డైలాగ్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అంతేకాకుండా ‘‘నేనుండగా నీకు ఏం కాదు టాకా.. భయపడకు’’ అనే డైలాగ్‌లో హీరోయిజం ఉంది. ఆ డైలాగ్‌ను మహేశ్ బాబు చెప్తుంటే మరింతగా ఆకట్టుకుంటోంది. ఇలా ఈ ట్రైలర్‌లో మహేశ్ బాబు డైలాగ్స్ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా. సినిమాపై అంచనాలు పెంచేసింది. మొత్తంగా ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. అందుకు సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. కాగా ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×