BigTV English

Mufasa Trailer: ముఫాసా ట్రైలర్ మామూలుగా లేదుగా, గూస్‌బంప్స్‌ అంతే..!

Mufasa Trailer: ముఫాసా ట్రైలర్ మామూలుగా లేదుగా, గూస్‌బంప్స్‌ అంతే..!

While Mufasa’s Trailer Isn’t Typical, Goose Bumps: బాలీవుడ్‌ స్టార్‌, హీరో షారుక్​ ఖాన్‌ చిన్న కుమారుడు అబ్రంఖాన్‌ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కదా. తండ్రితో కలిసి అప్పుడప్పుడు ఫొటో షూట్‌లకు క్యూట్ క్యూట్‌​గా పోజులిస్తుంటాడు ఈ బుడ్డోడు. అయితే ఇప్పుడతను సిల్వర్​ స్క్రీన్‌​పై సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. కానీ నటుడిగా కాదు.వాయిస్‌ ఓవర్‌ అందిస్తున్నాడు అది కూడా ఓ ఇంపార్టెంట్‌ ప్రాజెక్ట్‌ కోసం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. హాలీవుడ్‌​లో ఐదేళ్ల కిందట వచ్చి సూపర్ హిట్ మూవీగా నిలిచిన ది లయన్ కింగ్ మూవీ. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రానుంది. అంతేకాదు ముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా థియేటర్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఈ మూవీ ఒకటనే చెప్పాలి.


ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ ఆరోన్‌ స్టోన్‌ సహా పలువురు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు.వరల్డ్‌ వైడ్‌గా ఈ ఏడాది డిసెంబర్‌ 20నాటికి రిలీజ్‌ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ రిలీజ్ కాగా..ఇందులో చిట్టి ముఫాసా పాత్రకే అబ్రం వాయిస్‌ చెప్పాడు. అలానే ఇదే మూవీలో ముఫాసా పెద్దయ్యాక పాత్రకు షారుక్‌ ఖాన్‌, సింబా పాత్రకు షారుక్‌ పెద్ద కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ వాయిస్‌ అందించారు. ఈ ప్రచార మూవీ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మెయిన్‌గా ఒకేసారి షారుక్ ఆయన వారసుల వాయిస్‌ను వినడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన ఫ్యాన్స్ రకరకాల కామెంట్లతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక ఇదే విషయమై షారుక్ రియాక్షన్ అయ్యాడు. అంతేకాదు తన పిల్లలతో కలిసి ఒక మూవీ కోసం పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని తన మనసులోని వ్యక్తం చేశాడు.

Also Read: ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.? చూస్తే షాక్ లవ్‌లో పడిపోతారంతే..!


ఈ మూవీ తనకెంతో ప్రత్యేకమని తెలిపాడు. అయితే ఈ మూవీలో ముఫాసా అనే లయన్ అడవికి రారాజు. అతడే ఓ అల్టిమేట్ కింగ్ అని చెప్పాలి. తన తెలివి తేటలని, జ్ఞానాన్ని తన కొడుకు సింబాకు అందిస్తాడు ఇందులో. తండ్రిగా ఆ రోల్‌ నా మనసుకు ఎంతో దగ్గరైందని కింగ్‌ ఖాన్ తెలిపాడు. బాల్యం నుంచి కింగ్‌​గా ఎదగడం వరకూ ముఫాసా లైఫ్​ ఎలా సాగిందనే విషయాన్ని ఈ మూవీలో అద్భుతంగా చూపించారని సంతోషం వ్యక్తం చేశాడు. నా పిల్లలతో కలిసి ఈ మూవీ కోసం వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని కింగ్ ఖాన్ అన్నాడు. కాగా బేరీ జెంకిన్స్‌ ఈ మూవీకి డైరెక్ట్ చేస్తున్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×