E-Paper
Advertisement

Raviteja in Multiplex Business: మహేశ్, బన్నీ బాటలో రవితేజ.. కొత్తగా మల్టీప్లెక్స్ బిజినెస్.. పేరు ఏంటంటే?

Raviteja in Multiplex Business: మహేశ్, బన్నీ బాటలో రవితేజ.. కొత్తగా మల్టీప్లెక్స్ బిజినెస్.. పేరు ఏంటంటే?
Advertisement
raviteja latest news

Raviteja Entered in Multiplex Business(Tollywood news in telugu): టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్‌లపై ఫోకస్ పెడుతున్నారు. ఇందులో ఇప్పటికే మహేశ్ బాబు ఏఎంబీ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్, అల్లు అర్జున్ ఏఏఏ థియేటర్, విజయ్ దేవరకొండ ఏవీడీ థియేటర్‌ను రన్ చేస్తున్నారు.

కాగా మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ప్రముఖ ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో ఈ థియేటర్ల బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇదే కోవలోకి మరో టాలీవుడ్ స్టార్ హీరో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ తాజాగా ఈ థియేటర్ల బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Advertisement

హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించబోతున్నాడు. ఈ మల్టీప్లెక్స్‌కి ఏషియన్ రవితేజ పేర్లు కలిసి వచ్చేలా ఏఆర్‌టీ సినిమాస్ అనే పేరును పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం ఆరు స్క్రీన్‌లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Read More:  ప్రభాస్‌కు జోడిగా మరోసారి జాతీయ ఉత్తమ నటి..!

Advertisement

కాగా దాదాపు ఈ ఏడాదిలోనే ఏషియన్ రవితేజ మల్టిప్లెక్స్ థియేటర్ స్టార్ట్ కాబోతున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మాస్ మహారాజా రవితేజ త్వరలోనే అఫీషియల్‌గా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే రవితేజ ఇటీవల నటించిన సినిమా ‘ఈగల్’. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ అందుకుంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రవితేజ మాస్ లుక్‌లో కనిపించి కనువిందు చేశాడు. ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ 12 రోజుల్లో రూ.23.48 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×