BigTV English

Rakul Preet – Jackky Bhagnani: అందరి ముందు రకుల్ ప్రీత్‌సింగ్‌కు అక్కడ ముద్దు పెట్టిన జాకీ భగ్నానీ (వీడియో)

Rakul Preet – Jackky Bhagnani: అందరి ముందు రకుల్ ప్రీత్‌సింగ్‌కు అక్కడ ముద్దు పెట్టిన జాకీ భగ్నానీ (వీడియో)
Rakul Preet Singh - Jackky Bhagnani Wedding

Rakul Preet Singh – Jackky Bhagnani Wedding Video(Latest news in tollywood): టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌లో ఇరు కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ స్నేహుతులు, సన్నిహితుల సమక్షంలో గ్రాండ్‌గా వివాహ వేడుక జరిగింది.


పంజాబీ ఆనంద్ కరాజ్, సింధీ సంప్రదాయాల ప్రకారం.. ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. అందులో శిల్పాశెట్టి, ఆయుష్మాన్ ఖురానా, డేవిడ్ ధావన్, అర్జున్ కపూర్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

ఈ వేడుక తర్వాత ఈ జంట మొదటిసారి భార్య భర్తలుగా కనిపించారు. ఈ మేరకు ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే అదే సమయంలో వారి ప్రేమను అందరి ముందు వ్యక్తపరిచేందుకు ఈ లవ్ కపుల్ ఓ ముద్దు సీన్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. మ్యారేజ్ అనంతరం హూటల్ నుంచి బయటకు వచ్చిన ఈ జంట తమ మొదటి ముద్దును పంచుకున్నారు.


Read More: వైభవంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నాని వివాహం.. రెండు సాంప్రదాయాల్లో వేడుక

ఫొటోలకు ఫోజులిచ్చే సమయంలో జాకీ తన భార్య రకుల్ ప్రీత్ సింగ్‌ను దగ్గరకి లాగి.. ఆమె నుదిటిపై ముద్దు పెట్టడం ఈ వీడియోలో చూడవచ్చు. దీంతో రకుల్ కళ్లుమూసుకుని తన భార్త జాకీ భగ్నానీని కౌగిలించుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇక రకుల్ సినిమా కెరీర్ విషయానికొస్తే.. టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న వారిలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో సహా చాలా మంది స్టార్ హీరోలతో నటించి తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే గత కొంత కాలంగా టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది రకుల్.

అక్కడ మంచి హిట్లతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలోనే నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. ఇక అప్పటి నుంచి ఈ జంట ఘాడమైన ప్రేమలో మునిగి తేలుతూ వచ్చారు. చివరికి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×