BigTV English

Prabhas in Kannappa: ప్రభాస్‌తో మరోసారి జోడి కట్టనున్న జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్

Prabhas in Kannappa: ప్రభాస్‌తో మరోసారి జోడి కట్టనున్న జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్

Kangana ranaut with Prabhas in Kannappa Movie: మంచు విష్ణు గత కొంత కాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసపెట్టి సినిమాలు తీస్తున్నా.. ఆశించిన స్థాయిలో హిట్లు పడటం లేదు. ఇక ఆ మధ్య మంచి అంచనాలతో వచ్చిన జిన్నా సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.


దీంతో తన తదుపరి సినిమాల విషయంలో మంచు విష్ణు ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే తన వద్దకు వస్తున్న చాలా కథలలో డిఫరెంట్ స్టోరీలను ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల మంచు విష్ణు తన డ్రీమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ను శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అందరిలోనూ చాలా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


Read More: ‘కన్నప్ప’తో మంచు విష్ణు కొడుకు ఎంట్రీ.. ఒక్క సినిమాలో మూడు తరాల నటులు

ఇకపోతే ఈ మూవీలో భారీ తారగణం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ పాత్ర కేవలం 10 నిమిషాలే ఉంటుందని తెలుస్తోంది. అయినా ఆ 10 నిమిషాలు మాత్రం ఓ రేంజ్‌లో సినిమా ఉండబోతుందని గుస గుసలు వినిపిస్తున్నాయి.

ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే పార్వతి పాత్రలో ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. నయనతారతో పాటు ఇంకొందరి పేర్లు జోరుగా సాగాయి. అయితే తాజాగా మరొక హీరోయిన్‌ పేరు బయటకు వచ్చింది.

ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ పార్వతి పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఇదే కనుక నిజమైతే.. ప్రభాస్, కంగనా రనౌత్ కలిసి నటిస్తున్న రెండవ చిత్రం ఇదే అవుతుంది. ఎందుకంటే గతంలో వీరిద్దరూ కలిసి ఏక్ నిరంజన్ సినిమాలో నటించారు.

Read More: ‘క‌న్న‌ప్ప‌’లో ప్రభాస్ కోసం భారీ ప్లాన్స్.. ఈ సీన్లు సినిమాకే హైలైట్ అంట..!

ఇకపోతే ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నందుకు గానూ ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని సమాచారం. కేవలం మంచు ఫ్యామిలీతో ఉన్న స్నేహం కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మంచు విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×