BigTV English

Mumaith khan: ఏకంగా నలుగురితో డేటింగ్.. కట్ చేస్తే.. ముమైత్ ఊహించని కామెంట్స్..!

Mumaith khan: ఏకంగా నలుగురితో డేటింగ్.. కట్ చేస్తే.. ముమైత్ ఊహించని కామెంట్స్..!

Mumaith khan.. ఏ సినిమా ఇండస్ట్రీలో కైనా సరే ఎంతోమంది వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు.. కానీ అందులో కొంతమంది మాత్రమే చిరస్థాయిగా ఆడియన్స్ మదిలో నిలిచిపోతారు. అలాంటి వారిలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొని, చెరగని ముద్ర వేసుకున్న ముమైత్ ఖాన్ (Mumaith Khan) కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి రావడమే స్పెషల్ సాంగ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈమె, అదే తరహాలో పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు అందరితో కలసి స్టెప్పులేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రత్యేకించి కొన్ని స్పెషల్ సాంగ్స్ ప్రస్తావన వచ్చింది అంటే కచ్చితంగా ముమైత్ ఖాన్ పేరు వినిపిస్తుంది. అంతలా తన నటనతో పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది ముమైత్ ఖాన్. సౌత్ భాషలైన తమిళ్, కన్నడ భాషల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. అలాగే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడే వరుస అవకాశాలందుకొని మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఒడియా, బెంగాలీ భాషల్లో అద్భుతమైన డాన్స్ తో అక్కడి జనాలను ఉర్రూతలూగించింది.


మేజర్ ఆక్సిడెంట్ తో ఇండస్ట్రీకి దూరం..

తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తోనే కాకుండా రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss)లో కూడా సందడి చేసింది..కాకపోతే అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమైంది ముమైత్ ఖాన్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె అసలు విషయాలను చెప్పుకొచ్చింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ముమైత్ ఖాన్ మాట్లాడుతూ.. నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. అందుకే కోలుకోవడానికి ఇంటికే పరిమితం అయ్యాను. ప్రస్తుతం ఇప్పుడు కోలుకున్నాను. రీసెంట్గా ఎంతో ధైర్యం చేసి ఒక బిజినెస్ కూడా మొదలుపెట్టాను. దేవుడు మీద భారం వేసాను. అలాగే కొంతమంది సపోర్ట్ కూడా ఉంది. అందుకే ముందడుగు వేశాను అంటూ బిజినెస్ గురించి చెప్పుకొచ్చింది.


నలుగురితో డేటింగ్.. అందుకే పెళ్లి చేసుకోలేదు..

అలాగే ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? కనీసం డేటింగ్ అయిన చేశారా ? అని ప్రశ్నించగా ఆమె మాట్లాడుతూ..” ఇప్పటికే నేను నలుగురితో డేటింగ్ చేశాను. కానీ ఏ ఒక్కరూ కూడా జెన్యూన్ గా అనిపించలేదు. పైగా వర్క్ అవుట్ కాకపోవడం వల్లే వదిలేసాను. అయితే నేను టైం పాస్ చేయలేదు. కానీ నాకు సెట్ అవ్వలేదు అంతే. అందుకే పెళ్లి చేసుకోలేదు. సాధారణంగా ఎవరైనా సరే బ్రేకప్ అవ్వగానే రిలేషన్షిప్ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ నేనెలా కాదు పెళ్లి చేసుకోకూడదు, రిలేషన్షిప్ వద్దు అని అనుకోను . ఒకవేళ నాకు భవిష్యత్తులో పెళ్లి అనే యోగం రాసి ఉంటే కచ్చితంగా నాకు పెళ్లి జరుగుతుంది. తలరాతను మాత్రమే నేను నమ్ముకుంటాను అంటూ చెప్పుకొచ్చింది ముమైత్ ఖాన్. ప్రస్తుతం ముమైత్ ఖాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన నెటిజెన్స్ నలుగురితో డేటింగ్ లో ఒకరు కూడా మీకు నచ్చలేదా అని కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ముమైత్ ఖాన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×