Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad)..మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో చాలా రోజుల నుండి కొనసాగుతున్నారు. ఈయన ఎన్నో సినిమాలకు తన మ్యూజిక్ అందించారు. ముఖ్యంగా లవ్, రొమాంటిక్ సినిమాలకు దేవిశ్రీ మ్యూజిక్ కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. ఈయన మ్యూజిక్ కి ఎంతో మంది యూత్ ఫిదా అయ్యేవారు. అలా ఆనందం, ఖడ్గం, ఆర్య, వర్షం,వెంకీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఎన్నో హిట్ సినిమాలకు దేవి శ్రీ మ్యూజిక్ అందించారు. ముఖ్యంగా ఈయన మ్యూజిక్ వల్ల హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలా ఎంతో మంది యూత్ కి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటివరకు పెళ్లయితే చేసుకోలేదు. 40+ ఏజ్ లో ఉన్న దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) పెళ్లి చేసుకోకపోవడానికి తెర మీద చాలా కారణాలే వినిపిస్తాయి. అయితే తాజాగా మరోసారి దేవిశ్రీప్రసాద్ పెళ్లిపై స్పందించారు నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu)..
దేవీ పెళ్లిపై బన్నీ వాసు కామెంట్స్..
తాజాగా నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) కాంబోలో వచ్చిన తండేల్ (Thandel) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీప్రసాద్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..”ఈ సినిమా ఇంత బాగా రావడానికి దేవిశ్రీప్రసాద్ కూడా ముఖ్య కారణం. ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ అందించిన బుజ్జి తల్లి పాట అద్భుతంగా ఉంది. అలాగే మేము ఆయనను బుజ్జి అని ప్రేమగా పిలుచుకుంటాము. కానీ ఆ తల్లి ఎక్కడ ఉందో.. ఆయన ఏజ్ వాళ్ళందరికీ పెళ్ళై పిల్లలు పుట్టారు. మేము కూడా పెళ్లిళ్లు చేసుకొని హ్యాపీగా ఉన్నాం.కానీ దేవిశ్రీప్రసాద్ మాత్రం ఇంకా బ్రహ్మచారి గానే ఉన్నాడు. తొందరలోనే దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వారిని ఇండస్ట్రీలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లను చేయాలని నేను కోరుకుంటున్నాను” అంటూ బన్నీ వాసు చెప్పుకొచ్చారు. ఇక బన్నీ వాసు (Bunny Vasu) మాటలకి అక్కడే ఉన్న దేవి శ్రీ ప్రసాద్ అంతా దేవుడి చేతిలో ఉంది మనకు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అన్నట్టుగా సైగలు చేస్తాడు. ఇక బన్నీ వాసు దేవిశ్రీ మాటలకు దిల్ రాజు(Dil Raju) పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు.
పెళ్లి చేసుకోకపోవడానికి రకరకాల కారణాలు..
ప్రస్తుతం వీళ్లు మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఇక దేవి శ్రీ రీసెంట్ గా వచ్చిన సెన్సేషన్ మూవీ పుష్ప-2 (Pushpa-2) కి కూడా మ్యూజిక్ అందించారు. ఇక దేవిశ్రీప్రసాద్ పర్సనల్ లైఫ్ కి వస్తే.. ఆయన ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం లవ్ బ్రేకప్ అంటారు. గతంలో హీరోయిన్ ఛార్మి (Charmi)ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి మధ్య బంధానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత కూడా కొంతమంది హీరోయిన్లతో దేవిశ్రీప్రసాద్ డేటింగ్ చేస్తున్నట్టు రూమర్లు వినిపించాయి. కానీ అందులో ఏదీ నిజం అవ్వలేదు. మరి దేవిశ్రీ ప్రసాద్ ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటారో చూడాలి.