Bangladesh T20 League: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బిపిఎల్) మరోసారి వార్తల్లో నిలిచింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లీగ్ లోని ఓ ఫ్రాంచైజీకి తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదురయ్యాయి. ఎంతలా అంటే.. ఆటగాళ్ల ను బస్సుల్లో తింపే డ్రైవర్లకు కూడా పేమెంట్ చేయలేని పరిస్థితి ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ డ్రైవర్.. క్రికెటర్ల కిట్లకు తాళం వేసేసాడు. తన జీతం ఇస్తేనే.. ఆ తాళం ఇస్తానని పట్టుబట్టాడు.
Also Read: Abhishek Sharma: ఇంగ్లండ్ అంటే ఈ పంజాబీలకు అస్సలు పడదు.. ఊచకోతనే !
వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లోని దర్బార్ రాజ్ షాహి ఫ్రాంచైజీ తమ జట్టు ప్లేయర్లకు, స్టాఫ్ మెంబర్స్ కి కూడా ఫీజు బకాయిలు చెల్లించలేని విధంగా ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిందట. ఈ క్రమంలోనే తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. దీంతో ఆ జట్టులోని ఫారిన్ ప్లేయర్స్ తమ స్వదేశానికి తిరిగి వెళ్లలేక హోటల్ రూమ్స్ లోనే ఉండిపోయారట. కానీ రాజ్ షాహి ఓనర్ షాహిక్ రెహ్మాన్.. ఫారిన్ ప్లేయర్లు వారి స్వదేశానికి వెళ్లడానికి రిటర్న్ టికెట్లు బుక్ చేసినట్లు తెలిపారు.
ఆ తరువాత మిగిలిన బకాయిలు చెల్లించడంలో సదరు ఫ్రాంచైజీ విఫలం కావడంతో కొంతమంది ఫారిన్ ప్లేయర్లు ఢాకా లోని టీమ్ హోటల్ లోనే ఉండి పోవాల్సి వచ్చింది. వీరిలో వెస్టిండీస్ ప్లేయర్ మార్క్ డియల్, పాకిస్తాన్ ప్లేయర్ మహమ్మద్ హ్యరిస్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అఫ్తాబ్ అలామ్, జింబాబ్వే ప్లేయర్ రియాన్, వెస్టిండీస్ ప్లేయర్ మైగెల్ కమీన్స్.. సహా పలువురు ప్లేయర్లకు వారి పేమెంట్స్ అందకపోవడంతో హోటల్ రూమ్స్ లోనే ఉండిపోయారు.
అయితే వీరు బకాయిల చెల్లింపు పై టీం మేనేజ్మెంట్ తో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించినప్పటికీ ఎటువంటి ఫలితం రాలేదు. ఇక కొంతమంది లోకల్ ప్లేయర్లు అయితే వారి బకాయిలు తీసుకోకుండానే హోటల్ రూమ్స్ నుంచి వెళ్లిపోయారు. దర్బార్ రాజ్ షాహి టీమ్ రవాణా చేస్తున్న బస్ డ్రైవర్ కి కూడా ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం చెల్లింపులు చేయలేదు. దీంతో అతడు ప్లేయర్ల కిట్ బ్యాగులకు తాళం వేసేశాడు.
Also Read: Mukesh Ambani: అభిషేక్ శర్మకు.. ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్ ?
తనకు డబ్బులు ఇస్తేనే కిట్ బ్యాగులు తిరిగి ఇస్తానని చెప్పాడని క్రిక్ బజ్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో ఈ ఘటన క్రికెట్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ” నేను ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. ఇది బాధాకరమైన విషయం. అలాగే సిగ్గుచేటు. మా ఫ్రాంచైజీ మా పేమెంట్స్ ని క్లియర్ చేస్తే నేను వెంటనే ప్లేయర్ల బ్యాగ్ కిట్స్ ని తిరిగి ఇచ్చేస్తాను. ఒకవేళ బకాయిలు తీర్చకపోతే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది” అని బస్సు డ్రైవర్ మహమ్మద్ బబుల్ వెల్లడించినట్లుగా ఆ రిపోర్ట్ తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబి) రాజ్ షాహి జట్టు వ్యవహారంపై విచారణ చేపడుతోంది.
The non-payment of dues by Durbar Rajshahi to its overseas players and staff falls to a new low 😮
The bus driver has now locked the players kits in the bus after he too has not been duly remunerated 💰
Read the whole story by @atifazam42 https://t.co/T2jTPRCPAq#BPL2025 pic.twitter.com/UKZFKCP57e
— Cricbuzz (@cricbuzz) February 3, 2025