Tollywood Actress : సినీ ఇండస్ట్రీలో అందరూ హీరో హీరోయిన్లు అవ్వాల్సిన అవసరం లేదు.. సినిమాల్లో ఏదో ఒక పాత్ర ద్వారా జనాలకు దగ్గరవుతున్నారు కొందరు.. అయితే ఈ మధ్యకాలంలో ఒక సినిమా హిట్ అవుతుందంటే అందులో పాటలు సూపర్ హిట్ టాక్ ని అందుకుంటున్నాయి. ఇక ఐటమ్ సాంగ్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటున్నాయి. పాటలు వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయని కొందరు అంటున్నారు. ఇక మామూలు పాటలు కంటే ఐటెం పాటలు ఓ రేంజ్ లో హైలెట్ అవుతుంటాయి. ఈ సాంగ్స్ చేయడానికి హీరోయిన్లను ప్రత్యేకంగా దింపుతున్నారు దర్శక నిర్మాతలు.. గతంలో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఐటమ్ పాప తాజాగా తన బాయ్ ఫ్రెండ్స్ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది.. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు? ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ రోజుల్లో ఐటెం సాంగ్ లలో నటించే వాళ్ళు హీరోయిన్ల కన్నా ఎక్కువ డిమాండ్ తో ఉన్నారు. జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్కి స్మిత వంటి వారు ఐటెం సాంగ్స్‌తోనే హీరోలను మించిన స్టార్ డమ్ సంపాదించుకున్నారు.. ఆ తర్వాత సినిమాలలో ఐటెం సాంగ్ లే హైలెట్గా అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీని తన స్టెప్పులతో ఓ ఊపు ఊపేసిన ముమైత్ ఖాన్.. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు.. కాంబినేషన్‌లో వచ్చిన పొకిరీలో ఇప్పటికింకా నా వయసు నిండా 16 సాంగ్‌తో మాస్‌ను ఒక ఊపింది. ఇప్పటికీ ఈ పాట ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంది.. ఈమె కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే కాదు పలు సినిమాలో కీలక పాత్రల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒడియా, డాఖినీ భాషల్లో ఆమె పలు చిత్రాల్లో నటించడంతో పాటు ఐటెం సాంగ్స్ చేశారు. ఆ తర్వాత తెలుగు తెరకు దూరమైన ముమైత్ ఖాన్..
ఆ మధ్య బిగ్ బాస్ లో మెరిసింది. ఆ తర్వాత సినిమాల్లో కానీ బయట ఎక్కడ గాని కనిపించలేదు. రీసెంట్ ఇంటర్వ్యూలో అమ్మడు సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తను నలుగురితో డేటింగ్ చేసినట్టు బయట పెట్టింది. అయితే ఏ ఒక్కరు కూడా తనని సరిగ్గా అర్థం చేసుకోలేదని, తన కోరికలను తీర్చలేదని నిజాలను బయటపెట్టింది. నాకు భవిష్యత్తులో పెళ్లి అనేది రాసుంటే ఖచ్చితంగా చేసుకుంటానని ముమైత్ చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ ఆమెపై కామెంట్ చేస్తున్నారు. అయితే ఆమె డేటింగ్ చేసిన నలుగురు పేర్లు మాత్రం బయట పెట్టడానికి ఇష్టపడలేదు. అందుకే ఇండస్ట్రీకి దూరమైందా? అనే ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. ఈ ఇంటర్వ్యూ తో ఆమెకు సినిమాల్లో నటించాలనే కోరికను బయటపెట్టింది. దాంతో ఓ మూవీ ఆఫర్ ఆమెను వరించిందని టాక్ అయితే ఈ సారి ఐటమ్ సాంగ్స్ కాకుండా కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ముమైత్ ఖాన్ ఎన్ని రోజుల తర్వాత ఇంటర్వ్యూ కొచ్చి ఇలాంటి విషయాలను బయట పెట్టడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. మరి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..