ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇష్టంగా టీ తాగుతూ ఉంటారు. టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తో పోరాడటమే కాదు, క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు కూడా రాకుండా అడ్డుకుంటుంది.
ప్రతి ఒక్కరూ టీ ని ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కొంతమంది దీన్ని వేడివేడిగా ఇష్టపడితే కొంతమంది గోరువెచ్చగా తాగి ఎందుకు ఇష్టపడతారు. మరి కొంతమంది టీని చేసుకున్నాక దాన్ని అలాగే దాచిపెట్టి తాగాలనిపించినప్పుడల్లా వేడి చేసి తాగుతూ ఉంటారు. ఇలా టీ… మళ్లీ వెళ్లి వేడి చేసుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
టీ ని మళ్లీ వేడి చేయడం వల్ల దాని రుచి మారిపోవడంతో పాటు, పోషకాలు కూడా తగ్గిపోతాయి. అలాగే దాని వాసన కూడా కోల్పోవచ్చు. దీని నాలుగ్గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు. మళ్ళీ దాన్ని వేడి చేసి తాగడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల అందులో అప్పటికే బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. చక్కెర, పాలు కలిపిన టీ ని నిల్వ ఉంచడం వల్ల అది త్వరగా పాడే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియాలు కూడా చేరవచ్చు. ఈ టీ తాగడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, తిమ్మిరి, ఇతర జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఒకసారి టీ చేశాక దాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల ప్రోటీన్, సెల్యులోజ్, పిండి పదార్థాలు, మినరల్స్ వంటి వాటిని బంధించే టానిన్లు పెరిగిపోతాయి. దీనివల్ల ఆ టీ చేదుగా మారిపోతుంది. ఇనుము వంటి పోషకాలను శరీరం శోషించుకోకుండా అడ్డుకుంటాయి. కాబట్టి సాధారణీకరణ హెర్బల్ టీ తాగడం అన్ని విధాలా మంచిది. కేవలం పాలు, పంచదార కలిపిన టీనే కాదు.. హెర్బల్ టీ కూడా మళ్లీ వేడి చేసినప్పుడు పోషకాలు ఖనిజాలను కోల్పోతుంది.
టీ తయారు చేశాక వెంటనే తాగేయాలి. లేదా ఒక నాలుగు గంటల వరకు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచవచ్చు. ఆ తరువాత ఆ టీ ని మళ్లీ వేడి చేసి తాగడం వృధా. దానిలో బ్యాక్టీరియా పెరుగుదల వేగంగా జరుగుతుంది. కాబట్టి డబ్బును లేదా గ్యాస్ ను ఆదా చేయడానికి ఒకేసారి టీ ని ఎక్కువ మొత్తంలో చేసి… దాన్ని భద్రపరిచి మళ్లీ వేడి చేసుకుని తాగడం వంటివి చేయకపోవడమే. మొత్తం ఇలా తరచూ చేస్తూ ఉంటే ఆ ప్రభావం శరీరంపై పడుతుంది.
Also Read: తిన్న తర్వాత 15 నిమిషాలు నడిస్తే.. మతిపోయే లాభాలు