OTT Movie : సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటారు మూవీ లవర్స్. వీటిలో కొన్ని సినిమాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. మనుషుల సంబంధాలు మితిమీరితే వచ్చే అనర్థాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా తక్కువ కులంలో పుట్టిన ఒక మహిళతో, అగ్రకులం వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. దీని వలన వచ్చే సమస్యలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
యూట్యూబ్ (Youtube) లో
ఈ మూవీ పేరు ‘చౌరంగా‘ (Chauranga). ఈ మూవీకి బికాస్ రంజన్ మిశ్రా తొలి సారిగా దర్శకత్వం వహించాడు. దీనిని ఒనిర్, సంజయ్ సూరి నిర్మించారు. ఈ మూవీ 16వ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా, గోల్డెన్ గేట్‌వే ఆఫ్ ఇండియా అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం ఈ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక మారుమూల పల్లెటూరులో ధనియా అనే మహిళ ఉంటుంది. ఆమెకు భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటూ పిల్లల్ని చూసుకుంటుంది. సంతు, బజరంగి అనే ఇద్దరు పిల్లలు ధనియాకు ఉంటారు. బజరంగిని చదివిస్తూ ఉండగా, సంతు ఇంట్లో పని చూసుకుంటూ ఉంటాడు. అయితే ఊరు పెద్దమనిషి దవల్ కి, ధనియా కి మధ్య అక్రమ సంబంధం ఉంటుంది. అందుకుగాను దవల్ ఆమెకు డబ్బులు ఇస్తూ ఉంటాడు. అందమైన భార్య ఉన్నా గాని ధనియాతోనే ఆ పని ఎక్కువగా చేస్తుంటాడు. ఆ డబ్బులతో బజరంగిని చదివిస్తూ ఉంటుంది ధనియా. అయితే సంతు మాత్రం దవల్ కూతురికి సైట్ కొడుతూ ఉంటాడు. సంతు ఒకరోజు దవల్ కూతురికి లవ్ లెటర్ రాయాలనుకుంటాడు. చదువు రాకపోవడంతో తన అన్న భజరంగి సాయం తీసుకుంటాడు. ఒకరోజు ఆ ఊరిలో ప్రజలు చూసే విధంగా ఒక సినిమా వేస్తారు. అందరూ సినిమా చూస్తుంటే, దవల్, ధనియా ఏకంతంగా గడుపుతుంటారు. ఈ క్రమంలోనే ధనియాను ఒక పాము కాటేస్తుంది. ఆమె కాటు వేసిన కాసేపటికి చనిపోతుంది.
ఆ తర్వాత ధనియా బాడీని కొండ ప్రాంతంలో వదిలేసి వస్తాడు దవల్. ఈ ఘటన జరగగానే దవల్ కి జ్వరం వస్తుంది. డాక్టర్ ఇంటికి వచ్చి చెక్ చేసి మందులు రాయడానికి ఒక పేపర్ తీసుకు రమ్మంటాడు. దవల్ భార్య తన కూతురు మోనా బుక్ లో నుంచి ఒక పేపర్ తీసుకువస్తుంది. ఆ పేపర్ మరి ఏమిటో కాదు సంతు, మోనాకి ఇచ్చిన లవ్ లెటర్. డాక్టర్ రాసిచ్చిన చీటీని చదువుతూ లవ్ లెటర్ ని కూడా చూస్తాడు దవల్. ఆ లెటర్ చదివిన తర్వాత కోపంతో రగిలిపోతాడు దవల్. చివరికి సంతు ని దవల్ ఏం చేస్తాడు. తల్లి ఎలా చనిపోయిందో వీళ్ళకి తెలుస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘చౌరంగా’ (Chauranga) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.