E-Paper
Advertisement

The Goat Movie: మైత్రీ చేతికి విజయ్ గోట్.. పెద్ద ప్లానే వేశారుగా

The Goat Movie: మైత్రీ చేతికి విజయ్ గోట్.. పెద్ద ప్లానే వేశారుగా
Advertisement

The Goat Movie: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం త్వరత్వరగా సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. ఎందుకంటే.. ఆయన చేతిలో ఉన్న సినిమాలను త్వరగా ముగించి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడు. ఇక విజయ్ నటిస్తున్న చిత్రాల్లో ది గోట్ మూవీ ఒకటి. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కల్పతి ఎస్ అఘోరం నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో విజయ్ సరసన స్నేహ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రశాంత్‌, ప్రభుదేవా, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ ఒక కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విజయ్ డబుల్ రోల్ లో కనిపించనున్నాడు. సెప్టెంబర్ 5 న ది గోట్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

Advertisement

ఇక తాజాగా ది గోట్ ను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఏపీ, తెలంగాణలో మైత్రీ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఇది నిజంగా ఊహించని విషయం. తెలుగులో టాప్ బ్యానర్ గా మైత్రీ కొనసాగుతున్న విషయం తెల్సిందే. తమిళ్ హీరోలతో తెలుగు నిర్మాతలు మంచి స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక మైత్రీ చేతికి హక్కులు వచ్చాయి అంటే సినిమాపై అంచనాలను పెట్టుకోవచ్చని అర్ధం అయిపోయింది. ఇప్పటికే మైత్రీ.. అజిత్ తో కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఇప్పుడు విజయ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ విధంగా కోలీవుడ్ లో కూడా మైత్రీ మంచి ఎంట్రీ ఇవ్వడానికి గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×