BigTV English

Paytm CEO: సీఈవో డైలాగ్‌తో పేటీఎం స్టాక్ 9 శాతానికి..

Paytm CEO: సీఈవో డైలాగ్‌తో పేటీఎం స్టాక్ 9 శాతానికి..

Paytm Stock Rose 9 As Ceo Targets 100 Billion Dollar Valuation: మారుతున్న ఆధునిక టెక్నాలజీ నేపథ్యంలో భారత్‌లో నగదు లావాదేవీలు లేకుండా ఎక్కడ చూసిన డిజటల్‌ పేమెంట్స్‌కే మొగ్గుచూపుతున్నారు.ఎందుకంటే నగదు అయితే చోరికి గురవుతుంది.కాబట్టి యూపీఐతో సెకండ్ల వ్యవధిలో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు సులువుగా జరుగుతోంది.ఇందులో భాగంగానే పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా ఆన్‌లైన్‌ డిజిటల్ ఫేమెంట్స్ నడుస్తున్నాయి.అందులో పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే లాంటి డిజిటల్ సేవలు నడుస్తున్నాయి.నేడు దేశీయ స్టాక్ మార్కెట్‌లో డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం కంపెనీ షేర్లు భారీ పెరుగుదలను నమోదు చేశాయి.అయితే దీనికి కారణం సీఈవో విజయ శేఖర శర్మ చేసిన కామెంట్స్ కావటం గమనార్హం.


కంపెనీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను చూస్తున్నప్పటికీ శర్మ మాత్రం తన లక్ష్యాన్ని ఉన్నతంగానే ఉంచుకోవటం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.ఇంతకీ ఏం జరిగిందంటే..పేటీఎంను దేశంలో 100 బిలియన్ డాలర్ల కంపెనీగా మార్చాలన్నదే తన టార్గెట్‌ అని ఇటీవల కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నాడు.ప్రస్తుతం దేశంలో ఈ స్థాయి కలిగిన కంపెనీగా రిలయన్స్ ఉన్న నేపథ్యంలో పేటీఎం కంపెనీపై కమిట్మెంట్ చూసిన దేశీయ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు చేశారు.దీంతో పేటీఎం స్టాక్ ఇంట్రాడేలో ఏకంగా 9 శాతం పెరుగుదల నమోదు చేసింది.సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బిజినెస్‌పై ఆంక్షలతో విరుచుకుపడిన తర్వాత కంపెనీ మార్కెట్ ఏకంగా 3.5 బిలియన్ డాలర్లు క్షీణించింది.గురుగ్రామ్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న శర్మ తన ప్రసంగంలో పేటీఎం వృద్ధి గురించి ఆశాజనకంగా ఉన్నట్లు వెల్లడించారు.

Also Read: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మతిపోగొట్టే బైక్.. లుక్ నెక్స్ట్ లెవల్!


2024లో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ కంపెనీ పదునైన వృద్ధికి రెడీగా ఉందని చెప్పారు.పేటీఎం బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని తాను కోరుకుంటున్నానని ఈ క్రమంలో దానిని బిలియన్ డాలర్ల భారతీయ కంపెనీగా మార్చాలనే వ్యక్తిగత ఆశయంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.అయితే తాము ఇంకా మెరుగ్గా పనిచేసి ఉంటే బాగుడేదనే అభిప్రాయాన్ని పేటీఎంపై ఆర్బీఐ చర్యలపై శర్మ అభిప్రాయపడ్డారు.అయితే తాము ఇప్పుడు సవాళ్లను నావిగేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని శర్మ ఇటీవలి సంక్షోభంపై స్పందించారు.ఆర్బీఐ చర్యలతో పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో గణనీయమైన భాగాన్ని కోల్పోయింది.ఈ క్రమంలో నేడు పేటీఎం కంపెనీ షేర్ల ధర మార్కెట్లు ముగిసే సమయానికి గడచిన కొన్ని వారాలుగా కంపెనీ షేర్లు ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటున్నాయి.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×