E-Paper
Advertisement

Renu Desai: ఆ నీచులను వదలకండి.. జైల్లో వేసి చితక్కొట్టండి

Renu Desai: ఆ నీచులను వదలకండి.. జైల్లో వేసి చితక్కొట్టండి
Advertisement

Renu Desai: యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రీకూతుళ్ల మీమ్ పై అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు అతడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. డార్క్ కామెడీ పేరుతో నలుగురు ఫ్రెండ్స్ తో తండ్రి కూతుళ్ళ బంధాన్ని నీచంగా చూపించిన వీరిని వదలకూడదని హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించడంతో ఇది బయటపడింది.

తేజ్ కు టాలీవుడ్ మొత్తం సపోర్ట్ గా నిలబడింది. చిన్నపిల్లలను ఇలాంటి నీచమైన కామెంట్స్ చేయడం ఏంటి అని నెటిజన్స్ ప్రణీత్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం నెటిజన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా అతడిని తిట్టిపోస్తున్నారు.

Advertisement

తేజ్, మంచు మనోజ్, అడివి శేష్, మంచు విష్ణు, కార్తికేయ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. తాజాగా నటి, ఏపీ డిప్యూటీ సీఎం మాజీ భార్య రేణు దేశాయ్ సైతం తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇలాంటి నీచులను జైల్లో వేసి చితక్కొట్టాలని చెప్పుకొచ్చింది.

” ఈ నీచులు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. వేరే వాళ్లు షేర్ చేసుకున్న వీడియోలపై ఇలాంటి చెత్త వాగుడంతా వాగుతున్నారు.. ఇలాంటి నీచులను పోలీసులు అరెస్ట్ చేయాలి.. జైల్లో వేసి వాళ్ళను చితక్కొట్టాలి.. ఇది నా డార్క్ కామెడీ.. నా వాక్ స్వాతంత్ర్యం. ఈ మానసిక అస్థిర వ్యక్తులకు సపోర్ట్ చేసే వ్యక్తులను కూడా అరెస్టు చేయాలి” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంకోపక్క ప్రణీత్.. తాను చేసింది తప్పే అని.. తాను మాట్లాడింది ప్రజలు వేరే విధంగా అర్ధం చేసుకున్నారని, అయినా క్షమించమని ఒక వీడియో రిలీజ్ చేశాడు. మరి ప్రణీత్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారేమో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×