BigTV English

Naa Anveshana :రక్షించేవాడు కాదు రాక్షసుడు… సోనూ సూదే పెద్ద తిమింగలం

Naa Anveshana :రక్షించేవాడు కాదు రాక్షసుడు… సోనూ సూదే పెద్ద తిమింగలం

Naa Anveshana :రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ కేస్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మొదలుకొని.. పాన్ ఇండియా స్టార్స్ వరకు చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరిపై కూడా ఇప్పుడు కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పని గట్టుకొని మరీ వారి రహస్యాలను బయటకు తీస్తూ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్. యూట్యూబర్ నానిని మొదలుకొని యాంకర్ శివ జ్యోతి వరకు ప్రతి ఒక్కరి స్కామ్స్ బయట పెట్టిన ఇతడు.. ఇప్పుడు అతిపెద్ద తిమింగలం సోనూసూద్(Sonusood) అంటూ హాట్ బాంబ్ పేల్చారు. ఏకంగా రూ.1000 కోట్ల స్కామ్ లో సోనూ సూద్ హస్తం ఉంది అంటూ నా అన్వేషణ అన్వేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో కూడా రిలీజ్ చేశారు.


సోనూసూద్ రక్షించేవాడు కాదు.. రాక్షసుడు – అన్వేష్

సోనూసూద్ అనగానే హెల్పింగ్ కి కేరాఫ్ అడ్రస్. ముఖ్యంగా కరోనా సమయం వచ్చినప్పుడు ఏకంగా తన ఆస్తులనే కాదు తన భార్య ఆస్తులు కూడా అమ్మి ఎంతోమందికి సహాయ సహకారాలు అందజేశారు. ఆక్సిజన్ అవసరమైన ఏరియాలలో ఆక్సిజన్ సిలిండర్లను అందించిన ఈయన.. ఎంతోమందికి ట్రాక్టర్లతో పాటు వారి వృత్తికి అవసరమైన పరికరాలను కూడా అందించి మంచి మనిషిగా పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాదు రెండు లక్షల మంది వలసదారులను తమ ఇళ్లకు సురక్షితంగా చేర్చారు.. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈయనను.. రక్షించేవాడు కాదు రాక్షసుడు అంటూ ప్రూఫ్స్ తో సహా నిరూపించారు యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేస్తూ ఆ వీడియోలో ఇలా అన్ని విషయాలు తెలియజేశారు.


రూ.1000 కోట్ల స్కామ్ లో సోనూసూద్ హస్తం..

సోనూసూద్ బెట్టింగ్ సామ్రాజ్యానికే అధినేత. కరోనా టైంలో సోనూసూద్ ను కలియుగ కర్ణుడు అన్నారు. అయితే అలాంటి కర్ణుడు రాక్షసుడుగా మారి వేల కోట్లు ఎలా సంపాదించాడు. నేను ప్రూఫ్లతో సహా మీకు చూపిస్తాను. పేద కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకొని, అలా వచ్చిన డబ్బులు అన్నింటిని కూడా సహాయం చేసేసారు. అటు ఈయన భార్య నిర్మాత. రూ.50 కోట్లు పెట్టి సినిమా తీశారు. అంతా దానం చేసే వీరికి రూ.50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఈయన కర్ణుడికి ప్రతిరూపం కదా.. వచ్చిన ప్రతి రూపాయి కూడా దానం చేస్తూ వెళ్లిపోయారు. పైగా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఈ మధ్య ఫ్లాప్గానే మిగిలాయి. కలెక్షన్స్ అంతా కలిపినా కూడా రూ. 20 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.30 కోట్ల నష్టం సంగతి ఏంటి..? ఇక ఈ రూ.50 కోట్లు ఎలా వచ్చాయంటే అది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్. రూ.50 కోట్లు కాదు దాదాపు రూ.1000 కోట్ల వరకు బెట్టింగ్ యాప్స్ ద్వారానే అతిపెద్ద స్కాం చేశారు. అటు హర్ష సాయి, ఇటు సోనూ సూద్ ఇద్దరు అన్నదమ్ముల లాంటి వాళ్లు అంటూ సోనుసూద్ రహస్యాన్ని వీడియో ద్వారా రిలీజ్ చేశారు నా అన్వేషణ అన్వేష్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×