BigTV English

AP News : మహిళల న్యూడ్ వీడియోస్.. డాక్టర్‌ను చితక్కొట్టి..

AP News : మహిళల న్యూడ్ వీడియోస్.. డాక్టర్‌ను చితక్కొట్టి..

AP News : పేరుకు డాక్టర్. చేస్తున్నది మాత్రం చెండాలపు పని. బాత్‌రూమ్‌లలో హిడెన్ కెమెరాలు పెట్టాడు. మహిళల వీడియోలు సీక్రెట్‌గా రికార్డ్ చేశాడు. అలా చాలాకాలంగా జరుగుతోంది తంతు. తాజాగా అతని గుట్టు రట్టు అయింది. స్థానికులంతా కలిసి అతని హాస్పిటల్ మీద దాడి చేశారు. డాక్టర్‌ను చితక్కొట్టారు. అతని మొబైల్ చెక్ చేస్తే.. ఫోన్ నిండా బూతు వీడియోలే. బాత్‌రూమ్‌లో రికార్డు చేసిన మహిళల న్యూడ్ వీడియోలే.


పైల్స్ డాక్టర్ పాపిష్టి పనులు..

డాక్టర్ అంటే ఏ ఎంబీబీఎస్ డాక్టరో కాదు. RMP అంతే. అతని పేరు సర్కార్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంటాడు. కాకర్ల వీధిలో భవానీ పైల్స్ క్లినిక్ నడుపుతుంటాడు. పైల్స్‌కు ట్రీట్‌మెంట్ చేసుకోకుండా.. పిచ్చి పనులు చేయడం మొదలుపెట్టాడు. పెద్దగా పేషెంట్లు ఎవరూ ఉండరు. ఖాళీగా ఉండలేక.. ఫోన్లో పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడూ అదే యావలో ఉంటాడు. ఆ మైకం ముదిరి.. పైత్యం నరాలకెక్కి.. పైశాచిక పని చేశాడు. అతని క్లినిక్‌కు ఆనుకుని.. కొన్ని ఇరుగుపొరుగు వాళ్ల ఇళ్లు ఉన్నాయి. ఆయా ఇళ్ల బాత్‌రూమ్ కిటికీలు.. అతని క్లినిక్ గోడకు పక్కనే ఉన్నాయి. అది అడ్వాంటేజ్‌గా మార్చుకున్నాడు డాక్టర్ సర్కార్.


బాత్‌రూముల్లో కెమెరాలు పెట్టి..

తన హాస్పిటల్ క్లినిక్‌కు అనుకుని ఉన్న ఇళ్ల బాత్‌రూమ్ కిటికీల్లో హిడెన్ కెమెరాలు ఫిక్స్ చేశాడు. రాత్రి వేళల్లో అయితే.. తాను కనిపించకుండా దాక్కుని.. తన సెల్‌ఫోన్‌తో బాత్‌రూమ్‌కు వచ్చిన మహిళల వీడియోలు రికార్డు చేసేవాడు. అలా సుమారు 2 నెలలుగా వీడియోలు తీస్తున్నాడని తెలుస్తోంది. అలా ఆ ఆర్‌ఎంపీ డాక్టర్ వీడియో తీస్తుండగా ఓ మహిళ గమనించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో అతడి బండారం బయటపడింది.

Also Read : యువతి బట్టలు విప్పించి.. 8 గంటలు టార్చర్

సెల్‌ఫోన్ నిండా న్యూడ్ వీడియోలే..

స్థానికులు హాస్పిటల్‌కు వచ్చి వైద్యుడిని నిలదీశారు. అతను తనకు ఏం తెలీదని.. తాను అలాంటి పని చేయలేదని బుకాయించాడు. అక్కడి నుంచి తప్పించుకోవాలని చూశాడు. బాధితులు పట్టుకుని గట్టిగా ప్రశ్నించారు. అతడి సెల్‌ఫోన్ లాక్కొని చెక్ చేశారు. ఆ ఫోన్‌లో ఆ చుట్టు పక్కల మహిళల బాత్‌రూమ్ వీడియోలు చాలానే ఉన్నాయి. అడ్డంగా దొరికిపోవడంతో.. ఆ డాక్టర్‌ను పట్టుకుని చితక్కొట్టారు. మహిళలు చెప్పుతో కొట్టారు. హాస్పిటల్ ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం.. పోలీసులకు అప్పగించారు.

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×